ETV Bharat / bharat

ఆ బాలుడి ప్రతిభ అదుర్స్​.. నాలుగేళ్లకే డాక్టరయ్యాడు - karnataka hubballi news

పిన్న వయస్సులోనే అద్భుతాలు సృష్టిస్తుంటారు కొందరు. ఈ కోవకే చెందిన ఓ నాలుగేళ్ల బుడతడిని గౌరవ డాక్టరేట్​తో సత్కరించింది తమిళనాడుకు చెందిన యూనివర్సల్​ తమిళ్​​ విశ్వవిద్యాలయం. చిన్న వయస్సులోనే తన తెలివితేటలతో ఔరా అనిపిస్తున్న ఆ చిన్నారి గురించి తెలుసుకుందాం.

Honorary degree
ఆ బాలుడి ప్రతిభ అదుర్స్​.. నాలుగేళ్లకే డాక్టరయ్యాడు
author img

By

Published : Mar 22, 2020, 7:17 AM IST

ఆ బాలుడి ప్రతిభ అదుర్స్​.. నాలుగేళ్లకే డాక్టరయ్యాడు

సిద్ధార్థ గౌడ పాటిల్​.. సరిగా మాటలు రాని వయస్సులోనే తన తెలివితేటలతో అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. అబ్బురపరిచే జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్నాడు. నడిచే కంప్యూటర్​గా పిలిచే ఆ బాల మేధావికి.. గౌరవ డాక్టరేట్​ ఇచ్చి సత్కరించింది తమిళనాడుకు చెందిన "ది యూనివర్సల్​ తమిళ్​​" విశ్వవిద్యాలయం.

కర్ణా​టక హుబ్బల్లిలోని తబీబ్​ ల్యాండ్​ ప్రాంతానికి చెందిన గిరీష్​ గౌడ పాటిల్​, శివలీలా పాటిల్​ దంపతుల కుమారుడు సిద్ధార్థ గౌడ పాటిల్​. నవనగర్​లోని రాష్ట్ర విద్యానికేతన్​ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై ఏ విధమైన ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానమిచ్చే ఆ బుడతడు తన ప్రతిభతో సత్తా చాటుతున్నాడు.

ఎవరి గురించి అడిగినా..

వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి చిత్రాలను సులభంగా గుర్తిస్తాడు సిద్ధార్థ. వారి గురించి గుక్కతిప్పుకోకుండా అనర్గళంగా చెప్పగలడు కూడా. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, శాస్త్రవేత్తలు, స్వతంత్ర సమరయోధులు, రచయితలు ఇలా ఎవరి గురించి అడిగినా ఇట్టే చెప్పేస్తాడు పాటిల్​.

ఆధ్యాత్మికత ఎక్కువే..

సిద్ధార్థకు దైవ భక్తి ఎక్కువ. శ్లోకాలు పఠించడమంటే ఇష్టమని చెబుతున్నాడు ఈ బుడతడు. రోజు ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేచి స్నానం చేసుకుని పూజ చేసిన తర్వాతే పాఠశాలకు వెళతాడు. అతడి తల్లిదండ్రులు, నానమ్మ చెప్పిన ఆధ్యాత్మిక కథలు, వర్తమాన అంశాలు, మతపరమైన విషయాలను గుర్తుపెట్టుకొని తిరిగి అప్పజెప్పటం సిద్ధార్థ దినచర్యల్లో ఒకటి.

సిద్ధార్థ జ్ఞాపకశక్తిని వరంగా భావిస్తున్నారు అతని తల్లిదండ్రులు. ఒక్కసారి చెబితే దానిని ఎప్పటికీ మరిచి పోకుండా గుర్తుంచుకుంటాడని అంటున్నారు. అతడి శక్తిసామర్థ్యాలను మెచ్చి నాలుగేళ్లకే డాక్టరేట్ వరించడం​ పట్ల ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు.

"సిద్ధార్థ 600లకు పైగా చిత్రాలు గుర్తించగలడు. శ్లోకాలు, వచనాలు, పాటలపై అతనికి మక్కువ ఎక్కువ. రాయడం కన్నా చదవటమే చాలా ఇష్టం. ఫోటోలు గుర్తించే విషయంలో ప్రతి రోజు ఒక గంటపాటు సాధన చేస్తాడు. ఇలాంటి పనులు చేయటం 9నెలల వయస్సు నుంచే మొదలు పెట్టాడు. జీకే ప్రశ్నలు, సమాధానాలపై కూడా సాధన చేయించాం."

- శివలీలా గౌడ పాటిల్​, సిద్ధార్థ​ తల్లి

రికార్డులు దాసోహం..

సిద్ధార్థ​ అద్భుత జ్ఞాపక శక్తికి పలు రికార్డులు దాసోహమయ్యాయి. ఇప్పటికే.. ఫ్యూచర్​ కలాం బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, యూనివర్సల్​ అచీవర్స్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, యంగెస్ట్​ కిడ్​ అవార్డులు సొంతం చేసుకున్నాడు.

ఇదీ చూడండి: హైవే పై ఉల్లి- ఎగబడి సంచులు నింపుకున్న జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.