ETV Bharat / bharat

లాక్​డౌన్​లోనూ అవిశ్రాంతంగా పని చేస్తోంది ఆ శాఖ మాత్రమే!

లాక్​డౌన్​​ సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నాయి. అమిత్​ షా నేతృత్వంలోని కేంద్ర హోమంత్రిత్వ శాఖ మాత్రం నిర్విరామంగా పని చేస్తోంది. అన్ని రాష్ట్రాల సమస్యలకు పరిష్కారాలు చూపుతూ సమన్వయంతో కరోనాపై పోరును కొనసాగిస్తోంది.

home-ministry-fighting-covid-19-24x7
లాక్​డౌన్​లోనూ అవిశ్రాంతంగా పని చేస్తున్న ఏకైక మంత్రిత్వ శాఖ
author img

By

Published : Apr 13, 2020, 9:00 PM IST

కరోనాపై పోరులో అవిశ్రాంతంగా శ్రమిస్తోంది అమిత్ షా సారథ్యంలోని కేంద్ర హోమంత్రిత్వ శాఖ(ఎంహెచ్​ఏ). మిగతా శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు నిన్నటివరకు ఇళ్లనుంచే విధులు నిర్వర్తించి ఈరోజే కార్యాలయాలకు హాజరయ్యారు. హోంశాఖ మాత్రం మార్చి 24 నుంచి ఇప్పటివరకు ఒక్క రోజు కూడా విరామం లేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. లాక్​డౌన్ సమయంలో ఎలాంటి సమస్యలు, అవాంతరాలు తలెత్తకుండా అన్ని రాష్ట్రాలతో సమన్వయంతో పనిచేస్తోంది. రాష్ట్రాలు కోరిన సాయాన్ని అందిస్తోంది. వైద్య పరికరాలు అవసరమైన ప్రాంతాలకు చేరే ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా వ్యవహారాలను ఎప్పటికప్పడు సమీక్షిస్తోంది.

శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు అవసరమైన సరుకులు, వస్తువులు రాష్ట్రాలకు సరఫరా అయ్యేలా చూస్తోంది ఎంహెచ్ఏ. వలస కార్మికులకు ఆశ్రమం, ఆహార సదుపాయాలు కల్పిస్తోంది. హోంత్రి అమిత్ షాతో పాటు, సహాయ మంత్రులు కిషన్​ రెడ్డి, నిత్యానంద్​ రాయ్ ప్రతిరోజు కార్యాలయానికి వెళ్తున్నారు. హోంశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ భల్లా సహా సీనియర్ అధికారులు ప్రతిరోజు ఆఫీస్​కు హాజరవుతున్నారు. సెలవు రోజుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు.

లాక్​డౌన్ సమయంలో అమలు చేయాల్సిన నిబంధనలు, పలు విభాగాలను ఆంక్షల నుంచి మినహాయింపు వంటి అంశాలపై ఆయా రాష్ట్రాల కార్యదర్శులకు పదుల సంఖ్యలో లేఖలు పంపారు భల్లా. ఆయనకు ఆరుగురు అదనపు కార్యదర్శులు, 14 సంయుక్త కార్యదర్శులు సాయం అందించారు.

ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అమిత్​ షా కూడా పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశాలకూ హాజరయ్యారు.

ఇదీ చూడండి: 22 రోజులుగా వధువు ఇంట్లోనే 'బరాత్​ గ్యాంగ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.