ETV Bharat / bharat

సాధారణ పరీక్షల కోసమే ఎయిమ్స్​లో చేరిన షా - అమిత్​ షా హెల్త్​ న్యూస్

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మళ్లీ​ ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే షా... ఎయిమ్స్​లో చేరినట్లు వైద్యులు ప్రకటించారు. పార్లమెంటు సెషన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Home minister Amit Shah admitted to AIIMS again for problem in breathing
మళ్లీ ఎయిమ్స్‌లో చేరినఅమిత్‌ షా?
author img

By

Published : Sep 13, 2020, 6:44 AM IST

Updated : Sep 13, 2020, 12:36 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మరోసారి ఎయిమ్స్​లో చేరారు. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హాజరు కానున్న నేపథ్యంలో సాధారణ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. శనివారం రాత్రి 11 గంటలకు ఆయన ఎయిమ్స్‌లో చేరారు.

ఇటీవల కొవిడ్​ నుంచి కోలుకున్న ఆయన... డిశ్చార్జి సమయంలో చేసిన సూచనల మేరకే ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన్ను పర్యవేక్షిస్తోన్నట్లు సమాచారం.

ఆగస్టు 2న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల ఎయిమ్స్‌లోనే చికిత్స పొంది గత నెల 31న డిశ్చార్జి అయ్యారు. కొద్ది రోజులకే అనారోగ్యంతో తిరిగి ఆస్పత్రిలో చేరి కోలుకున్నారు.

ఇదీ చూడండి: కరోనాను జయించిన కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

శ్వాసకోశ సమస్యతో ఎయిమ్స్​లో చేరిన అమిత్​ షా

Last Updated : Sep 13, 2020, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.