సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా బిహార్ శివ్హర్లో విషాద సంఘటన జరిగింది. ఓ హోంగార్డు పొరపాటు... ఉపాధ్యాయుడి ప్రాణాలు బలిగొంది.
శివ్‌హర్ జిల్లా మాధవ్పుర్ సుందర్ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడు శివేంద్ర కుమార్, మరికొందరు అక్కడ పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు ఓ హోంగార్డు తుపాకీ పొరపాటున పేలింది. తూటా శివేంద్రకు తగిలింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా ప్రాణం విడిచారు శివేంద్ర.
హోంగార్డు తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ అయిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆరో దశలోనూ బంగాల్ హింస్మాతకం