వారాల తరబడి కురుస్తున్న వాన కారణంగా విరాజపేట తాలుకాలోని టోరా గ్రామంలో ఓ పెద్ద కొండ అమాంతం ఇళ్లపై పడింది. ఊరు ఊరంతా మట్టి దిబ్బలా మారింది. ఇళ్లన్నీ కూలి, 12 మంది సజీవ సమాధయ్యారు.
ఒకరికి సాయపడి.. ఒంటరిగా మిగిలాడు
అదే గ్రామానికి చెందిన పరమేశ్... కొద్ది గంటల ముందు కొండపై చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి అతడి ఇల్లు కనబడలేదు.
"నేను కొండపై ఉన్న మా వారిని కాపాడేందుకు వెళ్లాను. వెళ్లేటప్పుడు దారి బాగానే ఉంది. తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు కనబడలేదు. మా ఇంటిపై కొండ పడి ఉంది. నా భార్య, కుమార్తె చనిపోయారు."
-పరమేశ్, బాధితుడు
జాతీయ విపత్తు సహయక దళం రంగంలోకి దిగి వందలాది ప్రాణాలు కాపాడింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా పది లక్షల రూపాయలు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇళ్లు కూలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వారందరికీ హగ్గాలలోని ప్రభుత్వ పాఠశాలే గూడైంది. పరమేశ్ సహా దాదాపు 167 మంది గ్రామస్థులు ఆ బడిలో ఆశ్రయం పొందుతున్నారు.
ఇదీ చూడండి:అమానుషం: మతం మారినందుకు చిత్రహింసలు