ETV Bharat / bharat

నీరవ్​ కోసం జైలు బ్యారక్​ నెం.12 సిద్ధం

బ్రిటన్​లో జైలు జీవితం గడుపుతున్న వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లతో ఉన్న జైలుగదిని  సిద్ధం చేశారు మహారాష్ట్ర అధికారులు. బ్రిటన్ ప్రభుత్వం నీరవ్​ను భారత్​కు అప్పగించిన అనంతరం ముంబయి ఆర్థర్​ రోడ్​లోని బ్యారక్​ నెంబర్ 12లో ఉంచనున్నారు. నీరవ్​కు జైలు గది అంశమై కేంద్రానికి లేఖ రాసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

నీరవ్​ జైలు గది బ్యారక్​ నెం.12 సిద్ధం
author img

By

Published : Jun 11, 2019, 7:24 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​కు 14 వేల కోట్ల రుణం ఎగ్గొట్టి బ్రిటన్​కు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీకి జైలుగదిని సిద్ధం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ముంబయి ఆర్థర్ రోడ్​ జైల్లోని బ్యారక్​ నెంబర్​ 12ను నీరవ్​కు కేటాయించి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. నీరవ్​ మోదీని భారత్​కు అప్పగించిన అనంతరం ఈ బ్యారక్​లోనే ఆయనను ఉంచనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గదిని సిద్ధం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. గతవారం నీరవ్ కారాగార నివాసం సిద్ధమయినట్లు కేంద్రానికి సమాచారం ఇచ్చింది. జైల్లో నీరవ్​కు కల్పించే సదుపాయాల వివరాలను లిఖిత పూర్వకంగా వెల్లడించింది.

నీరవ్​కు 24 గంటల పాటు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని తమ లేఖలో పేర్కొంది మరాఠా ప్రభుత్వం. ఎలాంటి వివక్ష లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. కేటాయించిన గదిలో గాలి, వెలుతురు ఉండాల్సిన స్థాయిలో ఉన్నాయని, తాగేందుకు స్వచ్ఛమైన నీరే అందిస్తామని స్పష్టం చేసింది.

భారత​ విజ్ఞప్తిపై మార్చి 19న లండన్​ పోలీసులు నీరవ్​ను అరెస్టు చేశారు. బెయిల్​ కోసం గత నెలలో నీరవ్ బ్రిటన్​లోని వెస్ట్​మినిస్టర్​ కోర్టుకు విన్నవించారు. ఆ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

ఇదీ చూడండి: ఏఎన్​-32 విమాన శకలాలు 8 రోజులకు గుర్తింపు

RESTRICTIONS: Cleared worldwide for broadcast, digital and social use. Maximum use 90 seconds (per press conference/training session). Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Nice, France. 11th June 2019.
++SHOTLIST AND STORYLINE TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 02:25
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.