ETV Bharat / bharat

రాముడి వైభవాన్ని తెలిపే విశ్వమందిరం - Ram Lalla

ఏ ఆలయానికి లేని విధంగా ఐదు గోపురాలు.. హిందూ ధర్మశాస్త్రం ఉట్టిపడేలా స్తంభాలు... 67 ఎకరాల్లో నిర్మాణం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో అయోధ్య రామమందిరం రూపుదిద్దుకోనుంది. ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజతో రాముడి గుడి నిర్మాణ పనులు ఉపందుకోనున్నాయి.

ayodhya-will-look-like
రాముడి వైభవాన్ని తెలిపే విశ్వమందిరం
author img

By

Published : Aug 4, 2020, 3:55 PM IST

Updated : Aug 4, 2020, 11:24 PM IST

రాముడి వైభవాన్ని తెలిపే విశ్వమందిరం

అయోధ్యలో రామమందిర నిర్మాణం... కోట్లాది మంది హిందువుల ఆకాంక్ష. ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజతో ఆ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చూడతారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే రామాలయం ఎలా ఉంటుంది? అసలు భూమి పూజ ఎందుకు చేస్తారు? గుడి ఆకృతిలో ఉండే విశిష్టతలు, ప్రత్యేకతలు ఏమిటి? ఇతర ఆలయాలకు ఈ నూతన నిర్మాణానికి తేడా ఏమిటి? వైశాల్యం, ద్వారాలు తదితర అంశాల్లో ఉండే ప్రత్యేకతలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చర్చించుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

భూమి పూజ ఎందుకంటే..?

హిందూ ధర్మశాస్త్రంలో భూమిని తల్లితో కొలుస్తారు. అందుకే ఏదైనా కొత్త నిర్మాణం ప్రారంభించినా.. వ్యవసాయ పనులు మొదలు పెట్టినా భూమి పూజ చేయడం ఆనవాయితీ.

ayodhya-will-look-like
రాముడి వైభవాన్ని తెలిపే విశ్వమందిరం

నిర్మాణ ప్రత్యేకతలు

  • ఆలయం నిర్మించే స్థలంలో పునాది 15 అడుగుల లోతు ఉంటుంది.
  • ఆలయాన్ని మొదట 141 ఆడుగుల ఎత్తులో నిర్మించాలని అనుకున్నా.. తర్వాత దాన్ని 161 అడుగులుగా నిర్ణయించారు.
  • 69 ఎకరాల స్థలంలో ప్రపంచంలో ఎక్కడా లేదని విధంగా 5 గోపురాలతో నిర్మితమవుతున్న ఏకైక హిందూ దేవాలయం ఇదే.
  • మూడు అంతస్తులతో కూడి ఉంటుంది ఈ ఆలయం. ప్రతి అంతస్తులో 106 స్తంభాలు ఉంటాయి. మొత్తం 318 స్తంభాలు ఉంటాయి. వీటన్నింటినీ హిందూ పురాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు.
  • రామ్ లల్లా విగ్రహం గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రతిష్ఠించనున్నారు. ఈ విగ్రహాన్ని భూమి పూజ సందర్భంగా తొమ్మిది రకాల అభరణాలతో అలంకరించనున్నారు.
  • వాస్తవానికి పూర్వ ఆలయం రెండు అంతస్తుల్లోనే ఉండేది. గుడి వైభవాన్ని మరింత ఇనుమడింపచేసేందుకు దాన్ని మూడు అంతస్తులకు పెంచారు.
  • సాధువులను సంప్రదించి, హనుమంతుడు, కృష్ణుడు వంటి ఇతర దేవతల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
  • ఆలయంలో భక్తులు ఎక్కడైనా కూర్చొని పూజలు చేసుకునేందుకు వీలుగా అనేక ప్రాంతాలు ఉండనున్నాయి.
  • ఆలయంలోకి ప్రవేశించడానికి ఐదు ద్వారాలు ఉంటాయి. సింగ్ ద్వారం, నృత్య మండపం, రాండ్ మండపం, పూజగది, గర్భగుడికి ద్వారాలు ఉంటాయి.
  • ayodhya-will-look-like
    రాముడి వైభవాన్ని తెలిపే విశ్వమందిరం
    ayodhya-will-look-like
    రాముడి వైభవాన్ని తెలిపే విశ్వమందిరం

40 కిలోల వెండి ఇటుకలు

  • ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఆలయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చేందుకు భూమి పూజలో గయాడామ్ నుంచి 40 కిలోల వెండి ఇటుకలను, పునాది కోసం ఫాల్గు నది ఇసుకను తెప్పించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.
  • భూమి పూజలో భాగంగా గర్భగుడి లోపల ఐదు వెండి ఇటుకలు కూడా అమర్చనున్నారు.
  • గంగా, యమున, సరస్వతి కలిసే సంగమం నుంచి భూమి పూజకు మట్టి, నీటిని తీసుకొస్తున్నారు.
  • దేశ రాజధానిలోని 11 పవిత్ర స్థలాల నుంచి తెచ్చే మట్టి, ఇసుకను శంకుస్థాపనలో ఉపయోగించనున్నారు.
    ayodhya-will-look-like
    రాముడి వైభవాన్ని తెలిపే విశ్వమందిరం

57ఎకరాల్లో కాంప్లెక్స్‌..

  • 69 ఎకరాలను రామాలయం కోసం కేటాయించారు. అందులో 10 ఎకరాల్లో ఆలయ నిర్మాణ చేపట్టనుండగా.. మిగిలిన 57 ఎకరాల్లో రామాలయ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
  • ఆలయ ప్రాంగణంలో 27 రకాల నక్షత్రాల చెట్లను కూడా నాటనున్నారు. ప్రజలు తమ పుట్టినరోజులను తమ రాశి ప్రకారం ఆ చెట్టు కింద కూర్చొని దేవతలకు ప్రార్థనలు చేసుకోవడం కోసమే నక్షత్ర చెట్లు నాటడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
  • ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించరు. కాంక్రీట్, మోరాంగ్ అనే నిర్మాణ సామగ్రితోనే ఆలయ నిర్మాణం పూర్తి చేయనున్నారు.
  • ఆలయ ప్రాంగణంలో 'రామకథ కుంజ్ పార్క్'ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాముడి జీవితం, ఇతర అంశాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
  • కాంప్లెక్స్​ నిర్మాణంలో భాగంగా జరిపిన తవ్వకాల్లో లభించిన అవశేషాలను భద్రపరిచేందుకు మ్యూజియం నిర్మించనున్నారు.
  • కాంప్లెక్స్ సముదాయంలోనే గోశాల, ధర్మశాల, మరికొన్ని దేవాలయాలు కూడా నిర్మించనున్నారు.
  • భూమిపూజ కోసం రాగి పలకను సిద్ధం చేస్తున్నారు. దానిపై ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం సంస్కృత భాషలో చెక్కించనున్నారు.
    ayodhya-will-look-like
    రాముడి వైభవాన్ని తెలిపే విశ్వమందిరం

నిర్మాణ వ్యయం ఎంతంటే..?

ఆలయ నిర్మాణానికి రూ .300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు అయోధ్య రామాలయ రూపకర్తలు నిఖిల్ సోమ్​పుర, ఆశీష్ సోమ్​పుర. ఆలయ ప్రాంగణం చుట్టూ ఊన్న 20 ఎకరాల భూమి అభివృద్ధికి రూ .1,000 కోట్లు అవసరం కానుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పుకునే అయోధ్య రామాలయ నిర్మాణ పనులను మూడున్నరేళ్లలో పూర్తిచేయాలని ట్రస్ట్​ భావిస్తోంది. ఆగమశాస్త్రాల పద్ధతిలో బుధవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 మధ్యలో ఆలయ భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నారు పండితులు.

Last Updated : Aug 4, 2020, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.