ETV Bharat / bharat

అయోధ్య కేసు: సుప్రీంలో ఎవరి వాదనేంటి? - అయోధ్య కేసు

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిపై హక్కు కోసం సుప్రీంకోర్టు వేదికగా.. హిందూ- ముస్లిం వర్గాలు వాడీవేడిగా వాదనలు వినిపించాయి. అయోధ్యలో 11వ శతాబ్దంలోనే రామమందిరం ఉండేదని, ఆ తర్వాత 1526లో బాబర్​ ధ్వంసం చేశారని హిందూ పక్షాలు కోర్టులో వాదించాయి. అయితే 1528 నుంచే అక్కడ మసీదు ఉండేదని.. వాల్మీకి రామాయణం కానీ, రామచరిత మానస్‌ కానీ అయోధ్యలో రాముడి జన్మ ప్రదేశాన్ని నిర్దిష్టంగా నిర్వచించలేదని ముస్లిం పక్షాలు కోర్టుకు నివేదించాయి. వీటితో పాటు సర్వోన్నత న్యాయస్థానంలో ఇరువర్గాల వారు మరిన్ని వాదనలు వినిపించారు. అవేంటంటే...

అయోధ్య కేసు: సుప్రీంలో ఎవరి వాదనేంటి?
author img

By

Published : Nov 9, 2019, 6:02 AM IST

అయోధ్య కేసు: సుప్రీంలో ఎవరి వాదనేంటి?

అయోధ్య భూవివాదం వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానంలో 40 రోజులపాటు నిర్విరామంగా వాదనలు జరిగాయి. కక్షిదారుల ఆస్తి హక్కులు, కేసులో వారి అర్హతలు సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 2.77 ఎకరాల భూమిపై హక్కు కోసం సుప్రీం వేదికగా హిందూ, ముస్లిం వర్గాలు వాడీవేడిగా తలపడ్డాయి. మరి ఎవరి వాదనేమిటో ఓసారి పరిశీలిస్తే...

హిందూ పక్షాల వాదనలు

అయోధ్యలో రామాలయాన్ని ఇంచుమించుగా 11వ శతాబ్దంలో విక్రమాదిత్య చక్రవర్తి నిర్మించి ఉంటారని.. ఆ గుడిని 1526లో బాబర్‌ లేదా 17వ శతాబ్దంలో ఔరంగజేబు ధ్వంసం చేసుంటారని హిందూ పక్షాలు సుప్రీంలో వాదించాయి. వాల్మీకి రామయాణం, స్కంద పురాణం, వశిష్ఠ సంహిత వంటి పురాతన గ్రంథాలు, క్రీస్తు శకం 400 సంవత్సరంలో 'ఫా హియన్‌', 600-670 మధ్యలో 'హ్యుయెన్‌త్సాంగ్‌' వంటి యాత్రికుల రచనల్లో అయోధ్య, అక్కడి పూజల ప్రస్తావన ఉందని తెలిపాయి.

బాబర్‌ సరయూ నదిని దాటి అయోధ్య చేరినట్లు తన పుస్తకం 'బాబర్‌నామా'లో రాశారని, కానీ అక్కడ మసీదు ఉన్నట్లు ఆయన ప్రస్తావించలేదని కోర్టుకు నివేదించాయి. వీటితో పాటు హిందూ వర్గాలు సుప్రీంలో వినిపించిన వాదనలివి..

  • మొఘల్‌ చక్రవర్తులు రచించిన 'ఐనీ అక్బరీ', 'తుజుక్‌ ఎ జహంగిరీ'లోనూ అయోధ్య నగర ప్రస్తావన ఉంది. ఈస్టిండియా కంపెనీ సహా అనేక మంది పాశ్చాత్య అధికారులు వేర్వేరు రికార్డుల్లో దీన్ని నమోదు చేశారు.
  • బాబ్రీ మసీదుపై ఇస్లామిక్‌ రచనలు కొన్ని... పవిత్ర ఖురాన్‌, హదిత్‌కు విరుద్ధంగా ఉన్నాయి.
  • రాముడి జన్మస్థానం అయోధ్యేనన్న విశ్వాసం శతాబ్దాలుగా ఉన్నట్లు అనేక ఆధారాలు చెబుతున్నాయి. జన్మస్థానంలో పూజలు చేసే హిందువుల ఆచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
  • వివాద ప్రాంతంలో ఒక ఆలయం ఉండేదని, అది ధ్వంసమైందని పురావస్తు శాఖ నివేదిక కూడా చెబుతోంది.
  • మసీదును ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. అయితే రామజన్మ భూమి ఒక్కటే ఉంది.

ముస్లిం పక్షాల వాదనలు

ముస్లిం వర్గాలు మరో కోణంలో వాదించాయి. వివాదాస్పద ప్రాంతంలో 1528 నుంచి మసీదు ఉండేదని తెలిపాయి. 1855, 1934లో ఈ ప్రార్థనా మందిరంపై దాడులు జరిగినట్లు రికార్డుల్లో నమోదైందని, 1949లో చొరబాటు కేసు కూడా దాఖలైందని.. ఇవన్నీ మసీదు ఉనికిని నిర్ధరిస్తున్నట్లు వాదనలు వినిపించాయి.
వాల్మీకి రామాయణం కానీ, రామచరిత మానస్‌ కానీ.. అయోధ్యలో రాముడి జన్మ ప్రదేశాన్ని నిర్దిష్టంగా నిర్వచించలేదని సుప్రీంకు నివేదించాయి. వీటితో పాటు ముస్లిం పక్షాల వాదనలు ఏమిటంటే..

  • మసీదుకు బాబర్‌ నిధులు ఇచ్చినట్లు, దాన్ని ఆ తర్వాత నవాబులూ కొనసాగించినట్లు బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా గుర్తించింది.
  • 1885లో దాఖలైన దావాలో సమర్పించిన అనేక పత్రాలు ఈ మసీదు ఉనికిని ధ్రువపరుస్తున్నాయి. ఆ స్థలం ముస్లింల అధీనంలోనే ఉండేది. 1949 డిసెంబరు 22, 23 తేదీల వరకూ అక్కడ ఈద్‌ ప్రార్థనలు జరిగాయి.
  • రామ జన్మభూమిలో దేవుడి ప్రతిమ ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవు. అక్కడ ఆలయం ఉండేదని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక అసమగ్రంగా, అసంపూర్తిగా ఉంది. అది వ్యాఖ్యానమే. శాస్త్రీయ ఆధారం కానేకాదు.
  • 1989 వరకూ హిందువులు ఆ వివాదాస్పద స్థలంపై హక్కులు కోరలేదు. ఆ ప్రదేశాన్ని మాకు అప్పగించాలని మేం మొదట దావా వేశాం. ఆ తర్వాతే హిందువులు పిటిషన్‌ వేశారు.
  • వివాదాస్పద ప్రాంతంలోని 'రామ్‌ ఛబుత్ర', 'సీతా రసోయి' హిందువుల అధీనంలో ఉన్నంత మాత్రాన వారికి స్థల యాజమాన్య హక్కులు దక్కవు. ప్రార్థనా హక్కులు మాత్రమే లభిస్తాయి.
  • 1992 డిసెంబరులో కూల్చివేతకు గురికావడానికి ముందున్న రీతిలో బాబ్రీ మసీదును పునరుద్ధరించాలి.

RESTRICTION SUMMARY: NO ACCESS RUSSIA/EVN
SHOTLIST:
RU-RTR – NO ACCESS RUSSIA/EVN
Uspenia Bay, Primorsky region, Russia – 8 November 2019
1. Various of Beluga whales being released into the wild from a boat
2. Various of whale in hammock
3. Various of scientists making checks
4. Wide of whales in boat
5. Whale being lowered in hammock
6. SOUNDBITE (Russian) Pjotr Tyupeleev, oceanologist:
"All 19 belugas onboard were released into their natural habitat. The work was carried out without any problems. On three of the animals we installed satellite tags. Safety was provided by a coast guard vessel."
7. Various of bay
STORYLINE:
Russia continued on Friday an operation to release 50 beluga-whales from a so-called "whale jail", a marine containment facility in Srednyaya Bay, near Vladivostok.
Throughout Tuesday and Wednesday, Russian oceanographers loaded the first part of 19 belugas onto two research-vessels that transported them to the release place in Uspenia Bay in Japanese Sea, 100 kilometers away from the "jail".
On Friday, scientists began releasing the whales.
Scientists completed their final veterinary checks and installed satellite tags on three of the animals.
Ninety belugas and 12 orcas were originally reported to have been kept in a marine containment facility in Srednyaya Bay.
Activists raised the alarm late last year when the whales were captured off the Pacific Coast.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.