ETV Bharat / bharat

'మూణ్నాలుగు నెలల్లో కరోనా టీకా సిద్ధం' - భారతదేశంలో కరోనా వ్యాక్సిన్

మరికొన్ని నెలల్లో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. ఆగస్టు నాటికి 40 లేదా 50 కోట్ల డోసులు అందుబాటులో వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే టీకా పంపిణీకి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమవుతోందని, శాస్త్రీయత ఆధారంగా అందరికీ సమాన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

Harsh Vardhan
హర్షవర్ధన్​
author img

By

Published : Nov 19, 2020, 3:20 PM IST

మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. శాస్త్రీయ సమాచారం ఆధారంగా 135కోట్ల మంది భారతీయులకు పంపిణీ విషయంలో సమాన ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

కొవిడ్ తర్వాత ఆరోగ్య వ్యవస్థలో మార్పులపై 'ఫిక్కీ ఎఫ్​ఎల్​ఓ' నిర్వహించిన వెబినార్​లో హర్షవర్ధన్ మాట్లాడారు.

"25, 30 కోట్ల మందికి సరిపడే 40, 50 కోట్ల డోసులు వచ్చే జులై-ఆగస్టు నాటికి వచ్చే అవకాశం ఉంది. సహజంగానే కరోనా యోధులు, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. టీకా పంపిణీకి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధమవుతోంది."

- డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

దేశంలో కరోనా వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా హర్షవర్ధన్ తెలిపారు. తొలుత పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కుల కొరత ఉండేదని.. కొన్ని నెలల్లోనే ఈ సమస్యను అధిగమించామని పేర్కొన్నారు.

మన శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాక్సిన్​ పరిశోధనల్లో ప్రపంచంలో చాలా మందికన్నా ముందున్నారని కొనియాడారు. నిర్ధరణ పరీక్షల్లోనూ వేగం పెరిగిందని అన్నారు.

ఇదీ చూడండి: 'టెక్నాలజీ ఫస్ట్'​ అనేదే మా పాలన మోడల్​​: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.