ETV Bharat / bharat

సానుకూలంగా 'కొవిషీల్డ్​' వ్యాక్సిన్ మొదటి డోసు ఫలితాలు

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌ను పుణెకు చెందిన భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుప్రతిలో పనిచేసే ఇద్దరు వలంటీర్లకు మొదటి డోసు వేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం, శరీర పనితీరు బాగానే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. నెలరోజుల తర్వాత వారికి మరో డోసు ఇస్తామని తెలిపారు.

Health parameters normal after administered the Oxford coronavirus vaccine
సానుకూలంగా 'కొవిషీల్డ్​' వ్యాక్సిన్ మొదటి డోసు
author img

By

Published : Aug 27, 2020, 5:33 PM IST

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌... భారత్‌లో రెండో దశ ప్రయోగ స్థాయిలో ఉంది. ఈ క్రమంలో పుణెకు చెందిన భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుప్రతిలో ఇద్దరు వలంటీర్లకు బుధవారం ఈ వ్యాక్సిన్‌ ఇవ్వగా.. వారి ఆరోగ్యం, శరీర పనితీరు చక్కగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ఈ 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌ను 32, 48 సంవత్సరాల వయసున్న ఇద్దరు వ్యక్తులకు మొదటి డోసు వేశారు.

"వ్యాక్సిన్‌ ఇచ్చిన దగ్గరి నుంచి మా వైద్య సిబ్బంది వారిని పరిశీలనలో ఉంచారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. నొప్పి, జ్వరం, సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఇతర అనారోగ్య సూచనలేమీ కనిపించలేదు. వారిని 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచి, అనంతరం ఇంటికి పంపివేశాం. వారిని ఎప్పటికప్పుడు మా సిబ్బంది సంప్రదిస్తూనే ఉన్నారు."

- జితేంద్ర ఓస్వాల్​, భారతి విద్యాపీఠ్ డిప్యూటీ మెడికల్ డైరెక్టర్‌

మరో నెల రోజుల్లో ఇంకో డోసు

నెలరోజుల తర్వాత వారికి మరో డోసు ఇస్తామని తెలిపారు. మరికొంతమందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారైన సీరమ్ సంస్థ.. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఆ సంస్థ భారత్‌తో దాని భద్రతను పరిశీలిస్తోంది.

ఇదీ చూడండి: 'సరిహద్దులో 1962 తరవాత ఇదే తీవ్రమైనది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.