ETV Bharat / bharat

హోటళ్లలో పాటించాల్సిన నిబంధనలు ఇవే - corona news

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 8 నుంచి ప్రారంభమయ్యే పని ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నూతన మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో 6 అడుగుల దూరం పాటించాలని పేర్కొంది.

Health Ministry releases SOPs for restaurants, hotels
హోటళ్లలో పాటించాల్సిన నిబంధనలపై నూతన మార్గదర్శకాలు
author img

By

Published : Jun 4, 2020, 10:52 PM IST

దేశంలో లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే ఉద్యోగులు విధుల్లోకి చేరుతున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.

  • మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్​ వినియోగించాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకూడదు.
  • ఆరోగ్య సేతు యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోవాలి.
  • ప్రార్థనా మందిరాలు, పని ప్రదేశాలు, హోటళ్లలో ప్రవేశ మార్గాల్లోనే థర్మల్​ స్క్రీనింగ్​, శానిటైజింగ్​ తప్పనిసరిగా నిర్వహించాలి.
  • హోటళ్లు, రెస్టారెంట్లలోకి ఎసింప్టొమాటిక్​(ఎలాంటి లక్షణాలు లేని వారు) సిబ్బంది, కస్టమర్లను మాత్రమే అనుమతించాలి. సిబ్బందిలో.. వయస్సుపైబడిన వారు, గర్భిణీలు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు ఎవరైనా ఉంటే.. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పార్కింగ్​, రెస్టారెంట్​ పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. శానిటైజింగ్​ చేస్తూ సరైన నియంత్రణ చర్యలు చేపట్టాలి.
  • వినియోగదారులు, సిబ్బంది లోపలికి వచ్చేందుకు, బయటికి వెళ్లేందుకు వేరు వేరు దారులు ఉండాలి.
  • డిజిటల్​ విధానం ద్వారా ఆర్డర్​ తీసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించాలి.
  • హోటళ్లు, ఆతిథ్య రంగ సేవల విభాగాల్లో అతిథుల ప్రయాణ, ఆరోగ్య వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. వాటితో పాటు గుర్తింపు, స్వీయ అంగీకార పత్రం తీసుకోవాలి. లగేజీని అనుమతించే ముందే క్రిమిసంహారకాలతో శుద్ధి చేయాలి. ఆట స్థలాలను మూసి ఉంచాలి.
  • రెస్టారెంట్లలో సీటింగ్​ 50శాతం తగ్గించాలి. వాడిపడేసే వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.