ETV Bharat / bharat

ఒక్కరోజులో 32 మంది మృతి- కొత్తగా 773 కేసులు - coronavirus latest news china

కరోనా దేశంలో వేగంగా విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 773మందికి కరోనా సోకింది. మొత్తంగా 149మంది మృతి చెందారు. వైరస్ బాధితుల సంఖ్య 5,194కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.

covid-19
ఒక్కరోజులో 32మంది మృతి.. కొత్తగా 773 కేసులు నమోదు
author img

By

Published : Apr 8, 2020, 4:58 PM IST

Updated : Apr 8, 2020, 5:03 PM IST

భారత్​లో కరోనా కారణంగా ఒక్కరోజు వ్యవధిలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 773 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 149మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 5,194మందికి వైరస్ సోకింది. 402 మందికి వ్యాధి నయమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. 80 శాతం వైరస్ కేసులు అతిస్వల్ప తీవ్రత ఉన్నవేనని నివేదించింది.

corona
భారత్​లో కరోనా గణాంకాలు

మానవ వనరుల కోసం..

వైరస్​పై పోరాడేందుకు పెద్దమొత్తంలో సిబ్బంది అవసరమవుతారని వెల్లడించింది ఆరోగ్య శాఖ. మానవ వనరులను అందుబాటులో ఉంచే దిశగా దృష్టి పెడుతున్నట్లు తెలిపింది. ఆరోగ్య సిబ్బందికి వ్యాధి సోకకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పింది. వైరస్​కు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు భారత్​లో సరిపోయినన్ని ఉన్నట్లు పేర్కొంది.

కాంటాక్ట్ ట్రేసింగ్​పై

కరోనా కేసులకు అవసరమైనన్ని ఆసుపత్రులను కేటాయించాలని రాష్ట్రాలకు సూచించింది ఆరోగ్య శాఖ. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను ముమ్మరం చేయాలని నిర్దేశించింది.

లక్షకు పైగా పరీక్షలు

139 ప్రభుత్వ ల్యాబ్​లు, 65 ప్రైవేటు ల్యాబ్​ల ద్వారా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్). ఇప్పటివరకు దేశంలో 1,21, 271 వైరస్ పరీక్షలు చేశామని తెలిపింది. ల్యాబ్​ల సమర్థతను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: సీఎంలతో శనివారం మోదీ భేటీ- లాక్​డౌన్​పై నిర్ణయం!

Last Updated : Apr 8, 2020, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.