ETV Bharat / bharat

'చర్చల ద్వారానే రైతుల సమస్యకు పరిష్కారం'

author img

By

Published : Dec 19, 2020, 9:59 PM IST

చర్చల ద్వారానే రైతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ కట్టర్​. రైతుల ఆందోళనలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​తో భేటీ అయ్యారు. నిరసనలు, సమస్య పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు.

Haryana CM meets Tomar
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ కట్టర్​

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో చేపడుతోన్న రైతుల ఆందోళనలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​తో సమావేశమయ్యారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ కట్టర్​. రైతుల ఆందోళనలు, పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు అధికావర్గాలు తెలిపాయి.

సమావేశానంతరం కీలక విషయాలు వెల్లడించారు కట్టర్​. రైతుల సమస్యను సత్వరం పరిష్కరించాలని సూచించినట్లు చెప్పారు.

" వచ్చే 2-3 రోజుల్లో చర్చలు జరుగుతాయని నమ్ముతున్నా. చర్చల ద్వారానే రైతుల ఆందోళనలకు పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యను త్వరితంగా పరిష్కరించాలని మంత్రికి విన్నవించాను. సట్లేజ్​ యమునా లింక్​ కెనాల్​ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని పంజాబ్​ రైతులను కోరుతున్నా. సాగు నీటి కొరతతో హరియాణా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపైనా చర్చించాం. ఈ కెనాల్​ను పూర్తి చేయాలని డిమాండ్​ చేస్తున్నాం. "

- మనోహర్​లాల్​ కట్టర్​, హరియాణా ముఖ్యమంత్రి.

హరియాణాలోని రోహ్​తక్​ రైతులకు మద్దతుగా నిరసనల్లో భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్​.. పాల్గొన్న మరుసటి రోజునే ఈ భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు నిరసనలు చేపట్టిన తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రితో కట్టర్​​ భేటీ కావటం ఇది రెండోసారి. ఇంతకు ముందు డిసెంబర్​ 8న సమావేశమయ్యారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ హరియాణా, పంజాబ్​ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. రైతుల నిరసనలు 24వ రోజుకు చేరుకున్నాయి.

ఇదీ చూడండి: దిల్లీలో జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.