ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా పాలనాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాలుడిని రక్షించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. నజీబ్‌కు ప్రాణవాయువును అందించేందుకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు.
వెలుతురు లేమితో జాప్యం
60 అడుగులున్న బోరుబావి పక్కనే మరో 70 అడుగుల గొయ్యి తవ్వి బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపడుతున్నారు అధికారులు. రాత్రి కారణంగా బాలుడిని కాపాడేందుకు జాప్యం జరిగింది. తిరిగి ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీలు, క్రేన్ల సహాయంతో తవ్వకాలు చేపడుతున్నారు.