ETV Bharat / bharat

కశ్మీర్​ ఎన్​కౌంటర్​: వేర్పాటువాది కుమారుడు హతం - శ్రీనగర్ ఎన్​కౌంటర్​

శ్రీనగర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ప్రముఖ వేర్పాటువాది, హురియత్​ నేత కుమారుడు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. హురియత్​ ఛైర్మన్​ అష్రఫ్ సెహ్రాయి కుమారుడు జునైద్​.. 2018 నుంచి హిజ్బుల్​ ముజాహిద్దీన్ సంస్థలో క్రియాశీలకంగా ఉన్నాడని తెలిపారు.

JK-ENCOUNTER-IDENTITY
వేర్పాటువాది కుమారుడి హతం
author img

By

Published : May 19, 2020, 5:02 PM IST

శ్రీనగర్​లో నిన్నరాత్రి భద్రతాబలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వీరిలో ఒకడు ప్రముఖ వేర్పాటువాది కుమారుడు జునైద్ అష్రఫ్ ఖాన్​ సెహ్రాయిగా పోలీసులు గుర్తించారు.

"నిన్న రాత్రి జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు జునైద్... తెహ్రీక్​- ఏ- హురియత్​ సంస్థ ఛైర్మన్​ మహ్మద్​​ అష్రఫ్​ ఖాన్​ కుమారుడు. మరొకరు పుల్వామాకు చెందిన తారిఖ్ అహ్మద్ షేక్. ఇతను మార్చిలో హిజ్బుల్​ ముజాహిద్దీన్​లో చేరాడు.

హిజ్బుల్​కు డివిజనల్​ కమాండర్​గా జునైద్​ ఉన్నాడు. మధ్య కశ్మీర్​పై అతను పట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. చాలా క్రిమినల్​ కేసులకు సంబంధించి జునైద్​​ కోసం వెతుకుతున్నాం."

- దిల్​బాగ్​ సింగ్​, జమ్ము కశ్మీర్ డీజీపీ

ఇదే తొలిసారి..

జునైద్​.. కశ్మీర్​ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందాడు. 2018 మార్చి నుంచి కనబడటం లేదు. కొన్ని రోజుల తర్వాత ఏకే- 47తో అతను దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇలా ఒక వేర్పాటువాది కుమారుడు ఉగ్రవాదం వైపు వెళ్లటం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.

ఇద్దరికి గాయాలు..

నగరంలోని నవాక్​దల్​ ప్రాంతంలో ముష్కురులున్నారన్న పక్కా సమాచారంతో అక్కడ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు భద్రతా సిబ్బంది. వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇది ఎన్​కౌంటర్​కు దారి తీసింది.

ఉదయం 2 గంటల సమయంలో ఎన్​కౌంటర్​ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఆపరేషన్​లో ఓ సీఆర్​ఫీఎఫ్​ జవాను, ఓ పోలీస్​కు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్​ సేవలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.