ETV Bharat / bharat

దేశద్రోహం కేసులో మరోసారి 'హార్దిక్' అరెస్టు - Congress leader Hardik Patel was arrested on Saturday night

కాంగ్రెస్​ నేత హార్దిక్​ పటేల్​​ అరెస్టు అయ్యారు. 2015 నాటి దేశద్రోహం కేసులో విచారణకు హాజరుకాలేదని అహ్మదాబాద్​ అడిషనల్​ సెషన్స్​ కోర్టు శనివారం అరెస్టు వారెంట్​ జారీ చేసిన కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు క్రైం బ్రాంచ్​ పోలీసులు. అనంతరం.. అహ్మదాబాద్​ మేజిస్ట్రేట్​లో హాజరుపర్చగా జనవరి 24వరకు జ్యుడీషియల్​ కస్టడీ విధించింది.

hardik-patel-arrested-for-evading-sedition-case-trial
దేశద్రోహం కేసులో మరోసారి 'హార్దిక్' అరెస్టు
author img

By

Published : Jan 19, 2020, 6:37 AM IST

దేశద్రోహం కేసులో మరోసారి 'హార్దిక్' అరెస్టు

పాటిదార్​ నేత, కాంగ్రెస్​ నాయకుడు హార్దిక్​ పటేల్​ అరెస్టయ్యారు. 2015 నాటి దేశద్రోహం కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నారన్న కారణంతో అహ్మదాబాద్​ అడిషనల్​ సెషన్స్​ కోర్టు శనివారం.. అరెస్టు వారెంట్​ జారీ చేసింది. కొద్ది గంటల్లోనే గుజరాత్​ అహ్మదాబాద్​లోని విరంగం సమీపంలో పటేల్​ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

కాంగ్రెస్​ నేతను అరెస్టు చేసినట్లు సైబర్​ క్రైం డీసీపీ రాజ్​దీప్​సింగ్​ జాలా ధ్రువీకరించారు. అనంతరం.. హార్దిక్​ను అహ్మదాబాద్​ మేజిస్ట్రేట్​ ముందు హాజరుపర్చగా జనవరి 24వరకు జ్యుడీషియల్​ కస్టడీ విధించింది.

ఇదీ కేసు...

2015 ఆగస్టు 25న పాటిదార్లు జీఎండీసీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రజలను రెచ్చగొట్టే దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని హార్దిక్​ పటేల్​పై దేశద్రోహం కేసు నమోదు చేశారు క్రైం బ్రాంచ్ పోలీసులు. అయితే.. 2016 జులైలో బెయిల్​తో బయటకు వచ్చారు. 2018 నవంబర్​లో కోర్టు పటేల్​ సహా మరికొందరిపై అభియోగాలు మోపింది.

2019 లోక్​సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్​ పార్టీలో చేరారు హార్దిక్​ పటేల్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.