భారత యుద్ధ విమాన తయారీ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ సంస్థకు అందిస్తోన్న ఓ ఉద్యోగిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 41 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ప్రస్తుతం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడని వెల్లడించారు.
ముందుగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు
పాక్ నిఘా సంస్థతో సన్నిహితంగా మెదులుతోన్న ఈ ఉద్యోగి గురించి ముందుగా రాష్ట్రానికి చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు(ఏటీఎస్) తెలిసిందని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. నాసిక్‌కు సమీపంలో ఉన్న ఓజార్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ సంస్థ రహస్య వివరాలను, భారత యుద్ధ విమాన తయారీ వివరాలను నిందితుడు పాక్‌తో పంచుకునేందుకు యత్నించాడని తెలిపారు.
రహస్య సమాచార గోప్యత నిబంధనలను ఉల్లంఘించిన నిందితుడిపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 3 మొబైల్ ఫోన్లు, 5 సిమ్ కార్డులు, 2 మొమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:వివాదాస్పద ఎన్కౌంటర్ మృతుల ఇంటికి కశ్మీర్ ఎల్జీ