జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రకారం కరోనా వల్ల రోజుకు 101 మెట్రిక్ టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి విముక్తి పొందడానికి... గుజరాత్‌కు చెందిన పర్యావరణవేత్త బినీశ్ దేశాయ్ ఓ అద్భుత ఆవిష్కరణ చేశారు. పీపీఈ కిట్లు, మాస్కుల వ్యర్థాల నుంచి పర్యావరణహిత ఇటుకలను రూపొందించారు.
ఈ ఇటుక 12*8*4 సైజులో ఉంటుంది. 7 కిలోల వ్యర్థాలతో ఓ చదరపు అడుగు ఇటుకను చేయవచ్చు. పీ-బ్లాక్ 1.0 కన్నా ఇది దృఢమైనదని... ఒక్కో ఇటుక ధర రూ.2.80 అని 27ఏళ్ల బినీశ్ వెల్లడించారు.
2016లో ఇదే తరహాలో కాగితం వ్యర్థాలు, చూయింగ్ గమ్, చెట్ల వ్యర్థాల నుంచి ఇటుకలు తయారు చేశారు బినీశ్.
ఇదీ చూడండి:- విమానం కోసం అమ్మ పుస్తెలతాడు తాకట్టు!