ETV Bharat / bharat

'కరోనా ముప్పును తక్కువ చేసి చూపుతున్న సర్కార్'

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి ప్రభుత్వాల తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. సమస్య ఏమాత్రం పెద్దది కాదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాన్ని అంగీకరించి సమస్యపై పోరాడాలని సూచించారు.

RAHUL-VIRUS-NURSES
రాహుల్
author img

By

Published : Jul 1, 2020, 2:04 PM IST

వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. ఈ మేరకు న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా, బ్రిటన్​, భారత్​లో పనిచేస్తోన్న నలుగురు భారతీయ నర్సులతో 30 నిమిషాలపాటు మాట్లాడారు రాహుల్.

ఈ సంభాషణలో కరోనా వాతావరణంలో వారి కుటుంబ జీవితాలపై పడే ప్రభావం గురించి చర్చించారు. వారి అనుభవాలు విన్న ఆయన.. ఈ సంక్షోభ సమయంలో ప్రజలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

వైద్య నిపుణులతోనూ చర్చ..

అంతకుముందు వైద్య రంగ నిపుణులతోనూ రాహుల్ చర్చించారు. దిల్లీలోని చాలా ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించటం లేదని ఆరోపించారు. ఫలితంగా వారికి చికిత్స చేయటం సాధ్యం కావట్లేదని ఓ వైద్యుడు తనతో చెప్పినట్లు రాహుల్ వెల్లడించారు. చాలా మంది వైద్యులు కరోనా బారిన పడుతున్నారని కృష్ణన్​ అనే మరో నిపుణుడు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.

"ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని ప్రమాదకరం కాదనే విధంగా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మనం సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందువల్ల మనం వాస్తవాలను అంగీకరించాలి. ఈ సమస్యను కచ్చితంగా పోరాడాలి."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఇదీ చూడండి: 'లబ్ధి పొందటం మాని.. తక్షణమే ధరలు తగ్గించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.