ETV Bharat / bharat

ఔషధాలు అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు - కొవిడ్​-19

కొవిడ్​-19 రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మాస్కులకు విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. ఇదే అదునుగా అనేక ప్రాంతాల్లో మాస్కులు, ఔషధాల కృత్రిమ కొరత సృష్టించి, సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం.

Govt warns of stringent action against hoarding of masks, hand sanitisers
ఔషధాలు అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు
author img

By

Published : Mar 7, 2020, 6:09 AM IST

Updated : Mar 7, 2020, 6:34 PM IST

ఔషధాలు అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు

కొవిడ్​-19 (కరోనా) వైరస్​ భయంతో మాస్కులకు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఇదే సరైన సమయమని వ్యాపారులు వాటిని అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

"ప్రస్తుతం మాస్కుల డిమాండ్​, సరఫరాలకు సంబంధించి తాజా సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. మాస్కులు, శానిటరీస్​ కొరత లేదని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. అయితే త్వరలోనే వాస్తవాలను అంచనా వేసి.. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది." - డీవీ సదానందగౌడ, కేంద్ర రసాయనాల శాఖ మంత్రి

ఇప్పటివరకు మాస్కులు వాటి ఉత్పత్తుల కొరత ఉన్నట్లుగానీ, అధిక ధరలకు అమ్ముతున్నట్లుగానీ ఎలాంటి సమాచారం ప్రభుత్వానికి రాలేదని ఆయన వెల్లడించారు. అక్రమ నిల్వలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

దేశంలో కరోనా ఔషధాలకు, ఎలాంటి కొరత లేదని మంత్రి వెల్లడించారు. భారత్​లో 95 శాతం యాక్టివ్ ఫార్మాసూటికల్ (ఏపీ) ఔషధ నిల్వలు ఉన్నాయని, అయినప్పటికీ చైనా నుంచి దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు. మరో మూడు నెలలకు సరిపడా ఔషధాలు ఉన్నాయని ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు.

భారత్​లో వైరస్​ నిర్ధరణ అయిన కేసుల సంఖ్య 31కి చేరింది. మరో 29 వేల మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

ఇదీ చూడండి: మంచి చేసే వారిపై ద్వేషం ఎందుకు?: మోదీ

Last Updated : Mar 7, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.