ETV Bharat / bharat

టీకా కోసం రూ.3 వేల కోట్లతో కేంద్రం 'మిషన్'! - covid vaccine development in india

ప్రజలకు అందుబాటు ధరలో కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ తయారీ నుంచి పంపిణీ వరకు 3 వేల కోట్ల రూపాయల మూలధనంతో ఓ ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

Govt mulls 'Mission COVID Suraksha' with Rs 3,000-cr corpus
టీకా అభివృద్ధికి రూ.3 వేల కోట్లతో కేంద్రం 'మిషన్'!
author img

By

Published : Aug 24, 2020, 6:51 PM IST

Updated : Aug 24, 2020, 8:37 PM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయడం సహా ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండే టీకా అభివృద్ధి కోసం 'మిషన్ కొవిడ్ సురక్ష'ను కేంద్రం ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రూ. 3 వేల కోట్ల ప్రారంభ నిధితో దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించాయి.

జీవసాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ మిషన్​.. టీకా క్లినికల్ ట్రయల్స్​ నుంచి తయారీ వరకు ప్రతి ఒక్క దశపై దృష్టిసారిస్తుందని అధికారులు పేర్కొన్నారు. కనీసం ఆరు వ్యాక్సిన్ క్యాండిడేట్లకు లైసెన్సులు లభించేలా చేసి, సత్వరం మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ ప్రతిపాదనలు పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు. మిషన్ కాల వ్యవధి 12 నుంచి 18 నెలలు ఉంటుందని స్పష్టం చేశారు. దేశ అవసరాలకు తీర్చే విధంగా ఈ మిషన్ పనిచేస్తుందని చెప్పారు.

30 వ్యాక్సిన్​లు

ప్రస్తుతం దేశంలో 30 వ్యాక్సిన్ క్యాండిడేట్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఐసీఎంఆర్​, భారత్​ బయోటెక్​ సంయుక్తంగా తయారు చేస్తున్న టీకాతో పాటు జైడస్ కాడిలా వ్యాక్సిన్​లు రెండో దశ మానవ ప్రయోగాల్లో ఉన్నాయి. సీరం ఇన్​స్టిట్యూట్​ త్వరలో రెండు, మూడో దశ ప్రయోగాలు ప్రారభించనుంది.

ఇదీ చదవండి- సెప్టెంబర్​ 1 నుంచి మెట్రో రైల్​​ సర్వీసులు!

Last Updated : Aug 24, 2020, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.