ETV Bharat / bharat

ఈ-సిగరెట్స్​ నిషేధంపై ఆర్డినెన్స్​ జారీ - ఈ సిగరెట్స్

దేశంలో ఈ-సిగరెట్స్​పై నిషేదం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్​ జారీ చేసింది. వాటి తయారీ, దిగుమతి, అమ్మకం వంటివి చేస్తే నేరంగా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. తొలిసారి వీటితో పట్టుపడితే ఏడాది జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించనున్నారు.

ఈ సిగరెట్స్​ నిషేధంపై ఆర్డినెన్స్​ జారీ
author img

By

Published : Sep 19, 2019, 10:47 AM IST

Updated : Oct 1, 2019, 4:19 AM IST

ఈ -సిగరెట్స్​పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఎలక్ట్రానిక్​ సిగరెట్స్​ను నిషేధిస్తూ ఆర్డినెన్స్​ జారీ చేసింది. వాటి తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం లేదా ప్రకటనలు చేస్తే నేరంగా పరిగణించి జైలు శిక్ష విధించేందుకు నిర్ణయించింది.

ఈ-సిగరెట్స్​తో మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్షతో పాటు ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ తదుపరి నేరానికి పాల్పడితే సుమారు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, లేక రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది.

ఈ-సిగరెట్స్​ను కలిగి ఉంటే ఇప్పటి నుంచి శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. దీనికి సుమారు ఆరు నెలల జైలు శిక్ష లేక రూ.50వేల వరకు జరిమానా, ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది.

బుధవారం జరిగిన కేబినెట్​ భేటీలో ఎలక్ట్రానిక్​ సిగరెట్స్​పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ ప్రకటించారు.

ఇదీ చూడండి: ఝార్ఖండ్​: మూకదాడిలో యాచకుడు మృతి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 1, 2019, 4:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.