సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న న్యాయమూర్తి, అడ్వకేట్ జనరల్, ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్‌తో పాటు... వాయు సేన, సిగ్నల్స్, ఇంజినీర్, జవాన్, ఇంటెలిజెన్స్ కార్ప్స్ వంటి పది విభాగాల్లో శాశ్వత మహిళా కమిషన్ ఏర్పాటు కానుంది.
"ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్సెస్సీ) మహిళా అధికారులకు.. భారత సైన్యంలోని పది విభాగాల్లో శాశ్వత కమిషన్ ఏర్పాటవుతాయి. అర్హత గల మహిళా అధికారులందరూ అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసిన వెంటనే ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది ."
-కల్నల్ అమన్ ఆనంద్, సైన్యం అధికార ప్రతినిధి
ఇదీ చదవండి: హ్యామర్ క్షిపణితో రఫేల్‌కు మరింత శక్తి!