దేశంలో 'ఈ20' ఇంధనం వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు కోరుతూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు ఈ ఇంధనం ఉద్గార ప్రమాణాల అనుసరణపైనా సూచనలు ఆహ్వానించింది. ఈ20 ఇంధనం అంటే గ్యాసోలిన్, 20 శాతం ఇథనాల్‌తో కూడిన మిశ్రమం.
ఈ20 ఇంధనం వినియోగించడం ద్వారా కార్బన్‌డై ఆక్సైడ్, హైడ్రోకార్బన్స్ వంటి కర్బన ఉద్గారాలకు చెక్ పెట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ20 ఇంధనాన్ని వినియోగించుకునే వాహనాల వృద్ధికి ప్రకటన తోడ్పడుతుందని కేంద్ర రవాణాశాఖ అభిప్రాయపడింది. ఇంధన దిగుమతి వ్యయం తగ్గి, విదేశీ మారకద్రవ్యం తగ్గడంతోపాటు, ఇంధన భద్రత మరింత పెరుగుతుందని పేర్కొంది. ఇథనాల్, గ్యాసోలిన్ మిశ్రమంలోని ఇథనాల్ శాతానికి సరిపోయే వాహనాలను తయారీదారులే నిర్వహించాలని కోరింది. ఇందుకు సంబంధించిన వాహనాలను ప్రత్యేకంగా కనిపించేలా స్టిక్కర్ అతికించనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: సెంట్రల్ విస్టా: 15ఎకరాల్లో ప్రధాని నివాస సముదాయం