ETV Bharat / bharat

షాపులు తెరవడంపై హోంశాఖ కొత్త రూల్స్ ఇవే...

అన్నిరకాల దుకాణాలు తెరిచే అంశమై శుక్రవారం అర్ధరాత్రి జారీచేసిన ఉత్తర్వులపై వివరణ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. దుకాణాలు తెరిచేందుకు ఉండే పరిధిని నిర్ధరించింది. నివాస ప్రాంతాల్లో ఉండే దుకాణాలు, విడిగా ఉండే షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్ ప్రాంతాలు, షాపింగ్ మాల్​లు మూసివేసే ఉంచాలని తేల్చిచెప్పింది.

shops
కేంద్రం నిర్ణయంతో పొరుగు దుకాణాల వైపు ప్రజల చూపు
author img

By

Published : Apr 25, 2020, 11:49 AM IST

Updated : Apr 25, 2020, 11:56 AM IST

లాక్​డౌన్​ అమల్లో ఉన్నా దుకాణాలు తెరవడంపై మరింత స్పష్టత ఇచ్చింది కేంద్రహోంశాఖ. మునిసిపాలిటీలు, నగర కార్పొరేషన్లలోని నివాస ప్రాంతాల్లో ఉండే దుకాణాలు, విడిగా ఉండే షాపులను తెరవొచ్చని వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దుకాణాల పునఃప్రారంభంపై వేరువేరు సూచనలు చేసింది.

గత రాత్రి ఇచ్చిన ఉత్తర్వులపై కాస్త గందరగోళం నెలకొన్న తరుణంలో తాజా ప్రకటన చేసింది హోంశాఖ.

  • గ్రామీణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరిచేందుకు అనుమతి.
  • పట్టణాలు, నగరాల్లో మార్కెట్లు, మార్కెట్ ప్రాంతాల్లో ఉండే షాపులు, షాపింగ్ మాల్స్​లోని దుకాణాల పునఃప్రారంభంపై నిషేధం.
  • ఈ-కామర్స్ సంస్థలు నిత్యావసర సరుకులు మాత్రమే సరఫరా చేసేందుకు అనుమతి.
  • మద్యం సహా నిషేధిత జాబితాలో ఉన్న అన్నింటికీ ఈ మినహాయింపులు వర్తించవు.
  • వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి మినహాయింపులకు అవకాశం లేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు మాత్రమే వర్తిస్తాయి.

వైరస్ నియంత్రణ విధానాలతోనే..

హోంశాఖ మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పటివరకు వాయిదా వేసిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వస్తున్నారు. అయితే కొనుగోలుదారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే దుకాణాల్లోకి అనుమతిస్తున్నారు నిర్వాహకులు.

50 శాతం సిబ్బందితో..

దుకాణాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే ఉండాలని ఆదేశించింది హోంశాఖ. దుకాణ సిబ్బంది మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పనిచేయాలని వెల్లడించింది. మార్కెట్ ప్రాంతాలు, మాల్​ల మూసివేతతో పాటు.. సింగిల్, మల్టీ బ్రాండ్ల షోరూంలను కూడా తెరవకూడదని సూచించింది.

ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?

Last Updated : Apr 25, 2020, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.