ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో దాదాపు 3,000 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు బయటపడ్డాయి. కేంద్ర భూవిజ్ఞాన పరిశీలన (జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా), ఉత్తరప్రదేశ్ భూగర్భ, గనులశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేలో ఈ నిల్వలను గుర్తించినట్లు సోన్‌భద్ర జిల్లా మైనింగ్ అధికారి కేకే రాయ్ తెలిపారు. ఈ-టెండరింగ్ ద్వారా బ్లాక్‌ల వేలం త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలో బంగారంతో పాటు మరికొన్ని ఖనిజాలు కూడా లభించాయన్నారు.
సోన్‌భద్రలో బంగారు నిల్వలను కనుగొనే పనులను దాదాపు రెండు దశాబ్దాల క్రితం 1992-93 మధ్యకాలంలోో జీఎస్ఐ ప్రారంభించింది. సోన్ పహాడిలో 2,943.26 మెట్రిక్‌టన్నుల నిక్షేపాలుండగా.. హార్ది బ్లాక్ వద్ద 646.16 కిలోల బంగారు నిక్షేపాలున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఐదు రెట్లు ఎక్కువ
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం దేశంలో ప్రస్తుతం 626 టన్నుల బంగారు నిల్వలున్నాయి. కొత్త నిల్వలు ఆ మొత్తానికి దాదాపు 5 రెట్లు ఉన్నట్లు అంచనా. దీని విలువ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ట్రంప్ మనసులో ఏముంది..? వాణిజ్య ఒప్పందమా? ప్యాకేజీనా?