పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన క్రమంలో దిల్లీలోని జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసుల తీరును తప్పుపట్టారు కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్. వారి చర్య అత్యంత అమానవీయమని పేర్కొన్నారు. దేశంలోని అన్ని విపక్ష పార్టీల తరపున తమ గళాన్ని వినిపిస్తున్నామని తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై, దిల్లీ పోలీసులపై విమర్శలు చేశారు ఆజాద్.
" నిన్న దిల్లీ యూనివర్సిటీలో ఘటనలే కాదు.. అంతకు ముందు నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. పౌరసత్వ బిల్లు ఆమోదం పొందడానికి ముందు నుంచి నిరసనలు చెలరేగాయి. పోలీసులు వర్శిటీ క్యాంపస్ లో ప్రవేశించిన తీరు, లైబ్రరీ మొదలు, బాత్ రూమ్ల వరకు వెళ్లి విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్రస్థాయిలో ఖండించాల్సిన విషయం. వీసీ అనుమతి లేకుండా పోలీసులు వర్శిటీ లోపలికి ఎలా వస్తారు? జుడీషియల్ విచారణ జరగాలి. ఆందోళనల వెనక కాంగ్రెస్ ఉందని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్కు హింసను ప్రేరేపించే సామర్థ్యం ఉంటే.. మీరు అధికారంలో ఉండేవారు కాదు. అది నిరాధారమైన ఆరోపణ. ప్రధాని, హోంమంత్రి, వారి కేబినేట్ దీనికి బాధ్యత వహించాలి. "
- గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ నేత.