ETV Bharat / bharat

కరోనాతో యుద్ధానికి ఎన్​డీఆర్​ఎఫ్​ సిద్ధం - కోవిడ్ -19 తాజా వార్తలు

కరోనాతో సమరానికి సై అంటోంది జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్​డీఆర్​ఎఫ్​). అత్యవసర సమయాల్లో వైద్యులకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సర్వం సిద్ధమంటోంది. వైరస్​కు ఎదురెళ్లి పోరాడేందుకు సైనికులు నెల రోజుల పాటు శిక్షణ పొంది రంగంలోకి దిగారని స్పష్టం చేశారు ఎన్​డీఆర్​ఎఫ్​ సారథి​ ఎస్​ఎన్​ ప్రధాన్​.

getting-battle-ready-for-covid-19-emergency-ndrf-chief
కరోనాతో యుద్ధానికి సిద్ధమైన ఎన్​డీఆర్​ఎఫ్​
author img

By

Published : Mar 27, 2020, 8:44 PM IST

ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ముందుండే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్​డీఆర్​ఎఫ్​).. కొవిడ్​-19తో యుద్ధానికి సిద్ధమైంది. దేశంలో ఎన్నడూ ఎరుగని లాక్​డౌన్​కు దారితీసిన కరోనా ​మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పూనుకుంది. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు ఎన్​డీఆర్​ఎఫ్​ సారథి​ ఎస్​ఎన్​ ప్రధాన్.

శిక్షణ పొంది సిద్ధమయ్యారు

ఇప్పటికే వైరస్​ ప్రభావిత రాష్ట్రాల్లో​ బలగాలను మోహరించినట్లు ఎన్​డీఆర్​ఎఫ్ డైరక్టర్​ జనరల్​ ఎస్​ఎన్​ ప్రధాన్​ తెలిపారు. సిబ్బంది అంతా వ్యక్తిగత రక్షణ సామగ్రితో సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలాలకు వెళ్లి వైరస్​ బాధితులకు, వైద్య బృందాలకు సహాయ చర్యలు చేపడతారని వెల్లడించారు.

"నెల రోజుల నుంచి నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైనికులు తెలుసుకున్నారు. మాస్కులు, గ్లౌసులు, రక్షక దుస్తులతో ఎలా వ్యవహరించాలో శిక్షణ పొందారు. సామాజిక దూరం పాడించడం, ప్రాథమిక చికిత్స వంటి కీలకాంశాలపట్ల అవగాహన పెంచుకున్నారు" అని తెలిపారు ప్రధాన్​.

getting-battle-ready-for-covid-19-emergency-ndrf-chief
కరోనాతో యుద్ధానికి సిద్ధమైన ఎన్​డీఆర్​ఎఫ్​

"కరోనాతో పోరాటంలో మేము వైద్యుల వలె ముందు వరుసలో లేము. పారామెడికల్​ సిబ్బందిలా రెండో వరుసలోనూ లేకపోవచ్చు. కానీ, వైరస్​ను జయించేందుకు తప్పకుండా వారి తర్వాతి స్థానంలో సహకారం అందిస్తాం. నిర్బంధ కేంద్రాల వద్ద, అధిక కేసులు నమోదైన ప్రదేశాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు సాయం చేస్తాయి. స్థానిక పోలీసులతో కలిసి ప్రజలకు రక్షణ కల్పిస్తాం. "

-ఎస్​ఎన్​ ప్రధాన్​, ​ డైరక్టర్​ జనరల్​-​ ఎన్​డీఆర్​ఎఫ్

ఎన్​డీఆర్​ఎఫ్​లో మొత్తం 12 బెటాలియన్లున్నాయి. ఒక్కో బెటాలియన్​లో దాదాపు 1,150 మంది సైనికులుంటారు. ఇప్పటికే బిహార్​, తమిళ​నాడులో ఎన్​డీఆర్​ఎఫ్​ రక్షణ చర్యలు అందిస్తోందని గుర్తుచేశారు ప్రధాన్​.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్​: మూడు నెలల పింఛను​ ఒకేసారి ​వస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.