ETV Bharat / bharat

రామాలయ నిర్మాణానికి గంభీర్​ రూ.కోటి విరాళం - జగ్​దీప్​ ధన్​కర్​ వార్తలు

అయోధ్యలో చరిత్రాత్మక రామమందిర నిర్మాణం కోసం నిధులు పోగవుతూనే ఉన్నాయి. తాజాగా.. భాజాపా పార్లమెంట్​ సభ్యులు గౌతమ్​ గంభీర్​ కోటి రూపాయలు విరాళం ఇవ్వగా.. బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​ రూ.5లక్షలు అందించారు.

Gambhir contributes Rs one crore for Ram Temple construction
రామాలయ నిర్మాణానికి గంభీర్​ రూ.కోటి విరాళం
author img

By

Published : Jan 21, 2021, 6:44 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భాజపా ఎంపీ, టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్​ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. భారతీయుల చిరస్మరణీయమైన కల అయిన రామాలయ నిర్మాణానికి తమ కుటుంబం తరఫున ఈ సాయమందిస్తున్నట్టు చెప్పారు​.

"అయోధ్యలో చరిత్రాత్మక రామాలయ నిర్మాణం అనేది భారతీయుల కల. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యకు ఎట్టకేలకు తెరపడింది. రామ మందిరంతో ఐక్యత, ప్రశాంతతకు మార్గం సుగమమవుతుంది. ఈ ప్రయత్నంలో నా కుటుంబం తరఫున చిన్న సాయమందిస్తున్నాను."

- గౌతమ్​ గంభీర్​, తూర్పు దిల్లీ ఎంపీ.

మరోవైపు.. దిల్లీవ్యాప్తంగా విరాళాల సేకరణ కోసం ప్రచారం ప్రారంభమైందని భాజపా నాయకులు తెలిపారు.

బంగాల్​ గవర్నర్​ రూ.5లక్షలు

రామమందిర నిర్మాణం కోసం బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​, ఆయన భార్య రూ.5,00,001 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత చెక్కును ఆలయ ట్రస్ట్​ అధికారులకు అందజేసినట్టు రాజ్​భవన్​ ఓ ప్రకటనలో తెలిపింది.

West Bengal Guv, wife donate Rs 5,00,001 for construction of Ram Mandir in Ayodhya
జగ్​దీప్​ ధనఖర్​, బంగాల్​ గవర్నర్​

ఇదీ చదవండి: యూపీలో కాంగ్రెస్ 'క్యాలెండర్ రాజకీయాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.