గగన్యాన్ యాత్ర కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. ఇందుకోసం భారత వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు రష్యాకు చెందిన గ్లావ్కోస్మాస్తో ఒప్పందం కుదిరింది.
ఇస్రోలోని మానవ అంతరిక్ష నౌకా కేంద్రం (హెచ్ఎస్ఎఫ్సీ) డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్, గ్లోవ్కోస్మాస్ డిప్యూటీ డీజీ నటాలియా లోక్తేవా ఈ ఒప్పందంపై జూన్ 27న సంతకం చేశారు. ఇందులో భాగంగా ఎంపిక, వైద్య పరీక్షలు, అంతరక్ష శిక్షణ బాధ్యతలను ఈ సంస్థ నిర్వర్తిస్తుంది. ఈ విషయాన్ని గ్లోవ్కోస్మాస్ సంస్థ తన వెబ్సైట్లో ప్రచురించింది.
ఈ కేంద్రంలో ముగ్గురు వ్యోమగాములను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. ఇందులో ఒక మహిళకు అవకాశం ఉంటుంది.
గగన్యాన్ యాత్రను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించాక హెచ్ఎస్ఎఫ్సీని ఏర్పాటు చేసింది ఇస్రో. డిసెంబర్ 2021లో గగన్యాన్ ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం కేంద్రం రూ.9023 కోట్లు మంజూరుకు కేంద్ర కేబినెట్ 2018లో ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: 'భుట్టో' బుట్టలో పడిపోయాం: నట్వర్ సింగ్