ETV Bharat / bharat

రక్షా బంధన్​ కానుకగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసు

author img

By

Published : Aug 2, 2020, 9:02 AM IST

రక్షా బంధన్​ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ఈ సేవలు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనున్నాయి.

Free bus travel for women in Uttar Pradesh on Raksha Bandhan
రక్షా బంధన్​ కానుకగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసు

రక్షా బంధన్​ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం మహిళలకు కానుకనిచ్చింది. అన్ని కేటగిరీల మహిళలకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు.. ఉచితంగా బస్సు సర్వీసును అందించనున్నట్టు ప్రకటించింది యూపీఎస్​ఆర్​టీసీ.

రక్షా బంధన్​ నేపథ్యంలో స్వీట్​ షాపులు, రాఖీలు అమ్మే దుకాణాలు ఆదివారం తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు. దీనితో పాటు విస్తృతంగా పెట్రోలింగ్​ చేయాలని పోలీసులను ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రక్షా బంధన్​ను జరుపుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​.

దేశవ్యాప్తంగా సోమవారం.. రక్షా బంధన్​ను జరుపుకోనున్నారు ప్రజలు.

ఇదీ చూడండి:- అయోధ్యలో 3,500 పోలీసులు, 5వేల సీసీ కెమెరాలతో నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.