ETV Bharat / bharat

కరోనాపై భారత్​ పోరుకు ఫ్రాన్స్​ భారీ రుణసాయం

కరోనాపై పోరుకు సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యం పెంచేందుకు రూ.1700 కోట్లు భారత్​కు రుణసాయం అందించనుంది ఫ్రాన్స్​. ఈ మేరకు ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి.

France commits 200 million Euros for India's COVID-19 response
భారత్​కు ఫ్రాన్స్​ 200మిలియన్​ యూరోల రుణ సాయం
author img

By

Published : Jun 19, 2020, 12:06 PM IST

భారత ప్రజలను ప్రాణాంతక కరోనా నుంచి కాపాడటానికి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యాలను పెంచేందుకు రుణసాయం అందించడానికి ఫ్రాన్స్​ ముందుకొచ్చింది. భారత్​కు రూ.1700 కోట్లు రుణం ఇవ్వనుంది ఫ్రాన్స్​. ఈ మేరకు వర్చువల్​ వేదికగా ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ రుణ సహాయంతో ప్రాణాంతక కరోనా నివారణకు భారత్​తో కలిసి పని చేయనుంది ఫ్రాన్స్​. ప్రస్తుతమున్న సామాజిక రక్షణ చర్యలను మెరుగుపరచనున్నట్లు తెలుస్తోంది.

తక్కువ ఆదాయ కుటుంబాలకు కొవిడ్​-19 వల్ల ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేలా ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ యోజన(పీఎంజీకేవై)ను బలోపేతం చేయడంపై దృష్టి సారించనుంది భారత ప్రభుత్వం. తద్వారా దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధిలోనూ వారిని భాగస్వాములను చేసేలా మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తుంది. పీఎంజీకేవై కింద పరిహారం పొందలేని పట్టణ ప్రాంతాల్లోని వలస కార్మికులకు సామాజిక సహాయక కార్యక్రమాల ద్వారా చేయూతను అందించనుంది.

ఇదీ చూడండి: కశ్మీర్​లో 30 గంటల్లో 8 మంది ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.