ETV Bharat / bharat

'నీతి' భేటీకి ముందు సీఎంలకు సింగ్​ ట్యూషన్​!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై సింగ్​ పలు సూచనలు చేసినట్లు సమాచారం.

'నీతి' భేటీకి ముందు సీఎంలకు సింగ్​ ట్యూషన్​!
author img

By

Published : Jun 15, 2019, 1:13 PM IST

Updated : Jun 15, 2019, 3:08 PM IST

'నీతి' భేటీకి ముందు సీఎంలకు సింగ్​ ట్యూషన్​!

నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశానికి ముందు కాంగ్రెస్​ కీలక భేటీ నిర్వహించింది. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై మన్మోహన్ సింగ్​ పలు సూచలు చేసినట్లు సమాచారం.

ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోని గిరిజనులు, రైతుల సమస్యలను నీతి ఆయోగ్​ ముందు ప్రస్తావించాలని సింగ్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై కేంద్రం అశ్రద్ధ, అటవీ చట్టంలో సవరణలు, గిరిజనుల అభివృద్ధి, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ వంటి విషయాలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

సింగ్​ దూరం...

దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, పుదుచ్చేరి, కర్ణాటక ముఖ్యమంత్రులు కమల్​నాథ్, అశోక్​ గెహ్లోత్, నారాయణస్వామి, కుమారస్వామి హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ రాలేదు.

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపైనా మన్మోహన్​ ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

New Delhi, June 15 (ANI): The Indian Medical Association (IMA) delegation met Union Health Minister Dr Harsh Vardhan on Saturday, over the ongoing strike of doctors in West Bengal. While speaking to ANI, National President Elect of IMA, Dr Rajan Sharma said, "From last four days resident doctors in West Bengal are on strike and IMA also supported that strike. We called nationwide strike to support the demands and the welfare of the resident doctors situation in West Bengal. Yesterday, Harsh Vardhan told that we will provide the safe environment for the doctors. This meeting was to thank him and soon we will get assurance in writing. He said, our memorandum is with him and he will revert back." The junior doctors have been on strike since June 11 over violence against their colleagues in West Bengal.
Last Updated : Jun 15, 2019, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.