ETV Bharat / bharat

కరోనా పంజా: 12 గంటల్లో 9 మరణాలు, 131 కేసులు

గత రెండు, మూడు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. మరణాలు అదే స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటివరకు భారత్​లో 50 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం 1764 యాక్టివ్​ కేసులున్నట్లు స్పష్టం చేసింది. వీరిలో చాలా మందికి.. నిజాముద్దీన్​ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారితో సంబంధాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పంజాబ్​కు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత ఒకరు కొవిడ్​ ధాటికి ప్రాణాలు విడిచారు. హరియాణా, గుజరాత్​లోనూ ఒక్కొక్క మరణం నమోదైంది.

Former Golden Temple 'Hazuri Raagi' dies in Amritsar
మర్కజ్​ వెనుక ఇంకెందరు.. పెరుగుతున్న బాధితులు
author img

By

Published : Apr 2, 2020, 10:31 AM IST

దేశంలో కరోనా వైరస్​ తీవ్రరూపం దాల్చుతోంది. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దిల్లీ నిజాముద్దీన్​లో జరిగిన తబ్లిగీ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్నవారి కారణంగా వైరస్​ వ్యాప్తి మరింత విస్తరించింది. ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి.

దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 50 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 1764 యాక్టివ్​ కేసులున్నట్లు స్పష్టం చేసింది. మరో 150 మంది కోలుకున్నారు.

పద్మశ్రీ గ్రహీత మృతి..

పంజాబ్​లో కరోనా సోకిన పద్మ శ్రీ పురస్కార గ్రహీత, అమృత్​సర్​ స్వర్ణ దేవాలయం మాజీ 'హజూరీ రాగీ' ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కొవిడ్​ మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మొత్తం కేసులు 46కు చేరాయి.

62 ఏళ్ల ఆ ప్రముఖుడు ఇటీవలే విదేశాల నుంచి వచ్చారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను మార్చి 30న అమృత్​సర్​ గురునానక్​ దేవ్ ఆస్పత్రిలో చేర్చారు. కరోనా సోకినట్లు బుధవారం నిర్ధరణ కాగా.. సాయంత్రానికి పరిస్థితి విషమించింది. వైద్యులు వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు. అయినా... ఈ ఉదయం నాలుగున్నరకు తుదిశ్వాస విడిచారు.

విదేశాల నుంచి తిరిగివచ్చిన అనంతరం.. ఆయన దిల్లీ సహా ఇతర ప్రదేశాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కుటుంబసభ్యులందరి నమూనాలు సేకరించనున్నట్లు వెల్లడించారు.

మరో ఇద్దరు..

ఉదయం హరియాణా అంబాలాలో ఒకరు, గుజరాత్​లో మరొకరు కరోనాకు బలయ్యారు.

మహారాష్ట్రలో తీవ్ర రూపం..

మహారాష్ట్రలో మరో ముగ్గురు వైరస్​ బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 338కి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో 16 మందిని కరోనా బలితీసుకుంది.

అక్కడ మరో 12 మంది..

మధ్యప్రదేశ్​లో తాజాగా 12 మందికి కరోనా వైరస్​ సోకింది. మొత్తం కేసులు 98కి చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే వీరెవ్వరూ విదేశాలకు వెళ్లినవారు కాదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్​ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఒక్కడే 17 మందికి...

రాజస్థాన్​లో 9 కొత్త కేసులతో మొత్తం వైరస్​ సోకిన వారి సంఖ్య 129కు చేరింది. ఇందులో ఏడుగురు జైపుర్​ రామ్​గంజ్​కు చెందినవారే. ఈ ఏడుగురు రామ్​గంజ్​లో మొదట కరోనా సోకిన వ్యక్తితో సంబంధాలు కలిగిఉన్నవారేనని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆ బాధితుడితో సన్నిహిత సంబంధాలున్న 17 మందికి వైరస్​ వ్యాపించినట్లు పేర్కొన్నారు.

మర్కజ్​ బాధితులే...

మణిపుర్​లో కేసుల సంఖ్య రెండుకు చేరింది. కొత్తగా చేరిన బాధితుడు దిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం అలా 10 మంది వెళ్లిరాగా.. 8 మందికి నెగిటివ్​గా తేలింది.

అసోంలో మరో ముగ్గురికి కరోనా సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 16కు చేరింది. వీరందరూ మర్కజ్​ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత విశ్వ శర్మ తెలిపారు.

రాష్ట్రం నుంచి 347 మంది దిల్లీ మర్కజ్​కు వెళ్లారని.. అందులో 230 మందిని గుర్తించి క్వారంటైన్​లో ఉంచినట్లు పేర్కొన్నారు. మిగతావారి ఆచూకీ తెలియలేదని, వారి కుటుంబసభ్యులూ సహకరించట్లేదని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.