షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని సందర్శించడానికి దిల్లీలోని ఆమె స్వగృహానికి సీనియర్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్.. షీలా భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి షీలా పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఆమె అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్ వద్ద జరగనున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు.
ఇదీ చూడండి: ప్రియాంకకు బాసటగా షీలా దీక్షిత్ ఆఖరి నిర్ణయం