ETV Bharat / bharat

బాలల పేరు చెప్పి విదేశీ విరాళాలు స్వాహా! - NCPCR news updates

బాలల సంరక్షణ కోసం అందుతున్న విదేశీ విరాళాలు పక్కదారిపడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​(ఎన్​సీపీసీఆర్​). ఈ మేరకు 2018-19 సంవత్సరంలో ఐదు రాష్ట్రాల్లో బాలల సంరక్షణ సంస్థలకు అందిన విరాళాలు, అవి ఖర్చయిన తీరును విశ్లేషించింది ఎన్​సీపీసీఆర్​.

Foreign donations for childcare centers are being diverted to wrong way: NCPCR
బాలల పేరుతో విదేశీ విరాళాలు స్వాహా!
author img

By

Published : Nov 19, 2020, 9:28 AM IST

చిన్నారుల సంరక్షణ కోసం విదేశీ విరాళాల ద్వారా అందుతున్న నిధులు ఆర్థిక అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయన్న సందేహాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) వ్యక్తం చేసింది. 2018-19 సంవత్సరంలో ఐదు రాష్ట్రాల్లోని 638 బాలల సంరక్షణ సంస్థలకు అందిన విరాళాలు, అవి ఖర్చయిన తీరును విశ్లేషించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు ఎన్‌సీపీసీఆర్‌ తెలిపింది.

ఏడాదికి ఒక్కో చిన్నారికి కనీసంగా రూ.2.12లక్షలు...గరిష్ఠంగా రూ.6.6లక్షలు చొప్పున స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి. అయితే, ఏడాది మొత్తం అన్ని ఖర్చులు కలిపినా ఒక్కో చిన్నారిపై పెడుతున్న ఖర్చు రూ.60వేలు మించడం లేదని ఎన్‌సీపీసీఆర్‌ ఛైర్‌పర్సన్‌ ప్రియంక్‌ కనూన్‌గో తెలిపారు. కేంద్ర హోంశాఖలోని వివరాలు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద అందిన నిధులను విశ్లేషించామన్నారు. ఈ సమాచారం ఆధారంగా నిధుల దారి మళ్లింపునకు అవకాశాలు ఉన్నాయన్న అంచనాకు వచ్చామన్నారు.

Foreign donations for childcare centers are being diverted to wrong way: NCPCR
అందిన విరాళాలు- ఖర్చుల వివరాలు

ఇదీ చూడండి: అవి రక్షణ కాదు... భక్షణ కేంద్రాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.