ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి!

కేరళలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతిచెందారు. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Five people die in Palakkad, police suspects consumption of spurious liquor
కల్తీ మద్యమే ప్రాణం తీసిందా ?
author img

By

Published : Oct 20, 2020, 12:34 PM IST

కేరళ పాలక్కడ్​లోని చెల్లన్నమ్​ గిరజన కాలనీలో విషాదం జరిగింది. ఓ వ్యక్తి అంత్యక్రియల్లో భాగంగా కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిని రామన్, అయ్యప్పన్, అరుణ్, శివన్​, మూర్తిగా వలయార్​ పోలీసులు గుర్తించారు. మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

రామన్ ఆదివారం ఉదయమే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత వరుసగా మిగతావాళ్లు మరణించటంతో పోలీసులు మృతదేహాలను పంచనామాకు తరలించారు. 'కల్తీ మద్యం సేవించినందు వల్ల మరణించారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చాం 'అని వలయార్​ పోలీసులు తెలిపారు. 'ఇంకా కెమికల్ రిపోర్టు రావాల్సి ఉంద'ని వివరించారు.

శానిటైజర్​ కలిపి తాగారా ?

అస్వస్థతకు గురైన వ్యక్తి మద్యం సబ్బు రుచిని కలిగి ఉందని తెలిపాడు. దీంతో మద్యంలో శానిటైజర్​ కలుపుకొని తాగారా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్​ నిపుణుల సాయంతో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.