మధ్యప్రదేశ్ టీకంగఢ్ జిల్లా ఖర్గాపుర్లో విషాధ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ మైనర్ ఉన్నారు. అయితే ఉరేసుకుని మరణించిన వీరి పాదాలు నేలను తాకుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్పీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.