ETV Bharat / bharat

కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే.. - కరోనావైరస్ భద్రత

చైనాలోని వుహాన్​లో పుట్టిన కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. ఎందరో పరిశోధకులు, శాస్త్రవేత్తలు, విజ్ఞాన సంస్థలు, వైద్య విభాగాలకు తలనొప్పిగా మారింది. అందుకే వాళ్లంతా ఈ వైరస్​ అంతుతేల్చేందుకు రాత్రీపగలు శ్రమిస్తున్నారు. అయినా... 5 విషయాలు మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలాయి.

Five key questions that remain unanswered about the virus officially known as SARS-CoV-2 that leads to COVID-19.
కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..
author img

By

Published : Apr 1, 2020, 2:01 PM IST

కరోనా వైరస్​ అలియాస్​ కొవిడ్​-19 అంటే ప్రపంచంలో తెలియని వారు ఉండరేమో. మనిషిని సరిగ్గా ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిగిలిన వారిని ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా నిర్బంధంలోనూ పడేసింది. వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటూ.. లక్షల మందిని బాధితులుగా మార్చేస్తోందీ మహమ్మారి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనాపై అలుపెరుగక పోరాటం చేస్తున్నాడు మానవుడు.

చైనాలోని వుహాన్‌ సముద్ర ఆహార మార్కెట్‌లో ఈ వైరస్‌ను గతేడాది డిసెంబరులో గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు ఇది సోకినట్లు భావిస్తున్నారు. అయితే కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి.. శ్వాసవ్యవస్థపై పంజా విసిరి ప్రాణాంతకంగా మారింది. ఎంతో మంది దీని గురించి ఆరా తీస్తున్నా.. ఓ ఐదు విషయాలు మాత్రం ఇప్పటికీ పరిశోధకులకు సవాల్​ విసురుతున్నాయి.

తక్కువ స్థాయిలోనే లక్షణాలు?

ఏదైనా వ్యాధి సోకినప్పుడు బాధితుడు కొన్ని లక్షణాలతో బాధపడటం సహజం. కానీ కరోనా సోకిన వాళ్లలో 80 శాతం మందికి పెద్ద లక్షణాలేవి కనిపించకపోవడం విచిత్రం. ఈ వైరస్‌ సోకిన వారికి మొదట జలుబు వస్తుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, వాసన, రుచి కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మిగిలిన 20 శాతం మందిలో మాత్రం విపరీత లక్షణాలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన నిమోనియాతో బాధపడుతూ చనిపోతున్నారు. ఈ వ్యాధి కచ్చితమైన లక్షణాలపై ఇప్పటికీ ఓ స్పష్టతకు రాలేకపోయారు పరిశోధకులు.

కరోనా వైరస్​ ఎక్కువగా ముక్కు, గొంతుపైనే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో 60 శాతం బాధితులు ఇవే లక్షణాలతో బాధపడుతుండగా.. ఇందులో ఎక్కువగా వయో వృద్ధులే ఉండటం కలవరపెడుతోంది. వాళ్లలో తక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉండటం వల్ల ఎక్కువగా ఈ వైరస్​ బారిన పడి మృతి చెందుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపైనా ఇప్పటికీ స్పష్టత లేదు.

గాలిలోనూ వ్యాపిస్తుందా?

కరోనా లక్షణాలున్న వ్యక్తి.. దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్లతో పక్కవారికి ఈ వైరస్​ వ్యాపిస్తోంది. అయితే ఇది గాలిలో ఎంతసేపు ఉంటుదన్నది ప్రశ్నార్థకంగా మారింది. న్యూ ఇంగ్లాండ్​ అనే జర్నల్​లో ప్రచురించిన వ్యాసం ప్రకారం కరోనా గాలిలోనూ మూడు గంటలు ఉంటుంది. అయితే ఆ సమయంలోనూ వైరస్​ పక్కవారికి సోకుతుందా? లేదంటే నిర్జీవంగా ఉంటుందా? అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది.

కొంతమందికే పాజిటివ్​?

దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాల్లో ఇప్పటికే భారీగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ లెక్కల ప్రకారం ఎక్కువ మందికి వైద్య పరీక్షలు చేసినప్పటికీ... పాజిటివ్​ కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. మార్చి 17న బ్రిటన్​ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం 55 వేల మందికి ఈ వైరస్ ​పరీక్షలు చేస్తే.. 2వేల మంది మాత్రమే పాజిటివ్​గా తేలారు. వైరస్​ సోకిన వారిలోనూ 1 శాతం మంది మాత్రమే చనిపోతుండటం ప్రశ్నార్థకంగా మారింది.

వాతావరణం పాత్ర ఉంటుందా?

వేసవిలో కరోనా వ్యాప్తి తగ్గుతుందా లేదా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అయితే వాతావరణం పాత్ర కూడా ఈ వైరస్​పై ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. చల్లని, పొడి వాతావరణంలో ఫ్లూ, వాయి సంబంధిత వ్యాధులు కలగజేసే వైరస్​లు నిశ్చింతగా ఉంటాయి. ఇవి చలికాలంలో బాగా విజృంభిస్తాయి. అయితే 2002-03లో వచ్చి సార్స్​ వైరస్​ మాత్రం తక్కువ వాతావరణం, తేమ తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ బాగా ప్రభావం చూపింది. కరోనా కూడా అదే జాతి వైరస్​ కావడం వల్ల అవే లక్షణాలు కలిగి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే వాతారణంలో వేడి పెరిగితే కొవిడ్​-19 కేసులు తగ్గొచ్చని అమెరికాకు చెందిన హార్వర్డ్​ మెడికల్​ స్కూల్​ నిపుణులు చెప్పారు. ఈ అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

చిన్నారులకు ముప్పు తక్కువేనా?

పెద్దలు, యుక్త వయసువారికంటే చిన్నారుల్లో కరోనా ముప్పు తక్కువా? అనేది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. ఇప్పటివరకు చాలా తక్కువ మంది చిన్నారులకు ఈ వైరస్​ సోకగా.. వారందరూ చిన్నస్థాయి గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతోనే కోలుకున్నారని చైనాలోని ఓ పరిశోధన సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. అయితే గతంలోనూ సార్క్​ వైరస్​ చిన్నారులపై తక్కువ ప్రభావం చూపించిందని తేలింది. అన్ని వయస్సుల వారితో పోలిస్తే చిన్నారుల్లోనే తక్కువ బాధితులు ఎందుకు ఉన్నారనేది తెలియట్లేదు. చిన్నారుల ద్వారా వైరస్​ వ్యాప్తి తక్కువుగా ఉందని పలు నివేదికల్లో వెల్లడైంది. అయితే దీనిపైనా విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

వీటితో పాటు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులపై మళ్లీ వైరస్​ దాడి చేసే అవకాశముందా? అనేదీ ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఇలా చిత్ర, విచిత్ర లక్షణాలతో యావత్​ మానవాళికి పెను సవాలు విసురుతోంది కరోనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.