ETV Bharat / bharat

భారత పౌరులపై నేపాల్​ పోలీసుల కాల్పులు.. ఒకరు మృతి - indo nepal border

बिहार के सीतामढ़ी के सोनबरसा बॉर्डर के जानकी नगर गांव में फायरिंग की खबर सामने आई है. इसमें चार भारतीयों को गोली लग गई है. एक शख्स की मौत हो गई है.

firing-on-indo-nepal-border
భారత పౌరులపై నేపాల్​ పోలీసుల కాల్పులు
author img

By

Published : Jun 12, 2020, 11:58 AM IST

Updated : Jun 12, 2020, 1:15 PM IST

13:05 June 12

భారత పౌరులపై నేపాల్​ పోలీసుల కాల్పులు.. ఒకరు మృతి

భారత్-నేపాల్​ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. కాలాపానీ ప్రాంతంపై వివాదం కొనసాగుతున్న వేళ.. బిహార్​ సోన్​బర్సాలోని జానకీనగర్​ సరిహద్దు ప్రాంతంలో భారత పౌరులపై కాల్పులకు తెగబడ్డారు నేపాల్​ పోలీసులు. సరిహద్దు ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో పనులు చేసుకుంటున్న కూలీపై కాల్పులు జరపగా .. ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒకరిని నేపాల్​ పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు స్థానికంగా ఉండే ఉమేశ్​ రామ్​, ఉదయ్​ ఠాకూర్​లుగా గుర్తించారు అధికారులు.  

18 రౌండ్ల కాల్పులు..  

భారతీయ పౌరులపై 18 రౌండ్ల కాల్పులు చేపట్టాయి నేపాలీ బలగాలు. కాల్పుల మోతతో సమీపంలో పనులు చేస్తున్న కూలీలు పరుగులు తీశారు. భయంతో ఇళ్లల్లోనుంచి బయటకి వచ్చేందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో మరింత మంది గాయపడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.  

సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను మోహరించింది భారత్​. భద్రత కట్టుదిట్టం చేసింది. నేపాల్​ కూడా బలగాలను తరలించినట్లు సమాచారం. 

11:53 June 12

ఇండో-నేపాల్​ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. నలుగురు భారత పౌరులపై నేపాల్​ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పౌరుడు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బిహార్​ సోన్​బర్సా సరిహద్దులోని జానకీనగర్​లో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. 

Last Updated : Jun 12, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.