కేరళలో రక్తస్రావమైన ఓ గిరిజన గర్భిణిని నది దాటించడానికి సాహసమే చేశారు అగ్ని మాపక సిబ్బంది. ప్రాణాలకు తెగించి మహిళను ఆసుపత్రిలో చేర్చారు. ప్రవహిస్తున్న నదిలో , కుండపోత వానలో గర్భిణిని.. నది దాటించారు.
మలప్పురం జిల్లా, నిలాంబర్, ముండేరి తారిప్పపొట్టికి చెందిన కాంచన మూడు నెలల గర్భిణి. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాంచనకు ఉన్నట్టుండి రక్తస్రావమైంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమైందోనని తల్లడిల్లింది కాంచన. ఆ గ్రామం నుంచి ఆసుపత్రికి వెళ్లడానికి చలియార్ నదిపై నిర్మించిన ఓ వంతెనే ఏకైక దారి. కానీ, భారీ వర్షాలకు నది ఉప్పొంగింది, వంతెన మీదుగా నది ప్రవహిస్తోంది. అసలే నొప్పితో బాధపడుతున్న కాంచన వంతెన దాటే పరిస్థితి లేదు. ఈ సాయం కోసం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు కుటుంబసభ్యులు.
![Fireforce personnel brave heavy rains, strong currents in flooded Chaliyar; Save the life of a pregnant woman during a medical emergency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8772951_173_8772951_1599896182949.png)
వెంటనే స్పందించిన ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఎం.అబ్దుల్ ఘఫూర్ తన బృందంతో కలిసి ఓ రబ్బరు పడవలో గ్రామానికి చేరుకున్నారు. కాంచనను బోటులో ఎక్కించుకుని, గ్రామస్థులు నదిని దాటేందుకు వీలుగా అవతలి ఒడ్డు వరకు ఓ తాడు కట్టేశారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా కాంచనను గొడుగు నీడలో సురక్షితంగా మరో ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అటువైపు సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో ఎక్కించారు.
![Fireforce personne Saved the life of a pregnant woman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/klc-mpm-10012_11092020190309_1109f_1599831189_280.jpg)
![Fireforce personnel brave heavy rains, strong currents in flooded Chaliyar; Save the life of a pregnant woman during a medical emergency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/klc-mpm-10012_11092020190309_1109f_1599831189_471.jpg)
![Fireforce personnel brave heavy rains, strong currents in flooded Chaliyar; Save the life of a pregnant woman during a medical emergency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/klc-mpm-10012_11092020190309_1109f_1599831189_752.jpg)
![Fireforce personnel brave heavy rains, strong currents in flooded Chaliyar; Save the life of a pregnant woman during a medical emergency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/klc-mpm-10012_11092020190309_1109f_1599831189_164.jpg)
ఇదీ చదవండి: 400 మంది విద్యార్థుల కష్టం తీర్చిన 'ఈటీవీ భారత్'