దేశ రాజధాని దిల్లీలోని అనాజ్ మండీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముంద్క ప్రాంతంలోని ప్లైవుడ్ కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి.. ఎదురుగా ఉన్న బల్బ్ ఫ్యాక్టరీకి వ్యాపించాయి.
భారీ స్థాయిలో ఎగిసిపడిన జ్వాలలకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక దళం.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని.. మొత్తం 21 అగ్ని మాపక వాహనాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం- 43 మంది దుర్మరణం