బిహార్ ముజఫర్‌పుర్ జిల్లా మనియారీ పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఠాణాలోని ఫర్నీచర్, ఇతర దస్త్రాలు కాలి బూడిదయ్యాయి. అయితే.. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
గుజరాత్‌లోనూ..
గుజరాత్ అహ్మదాబాద్‌లోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నారన్‌పురా ప్రాంతంలో ఓ మూడంతస్తుల భవనంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని మూడు దుకాణాల్లో చెలరేగిన మంటల నుంచి ఎనిమిది మందిని కాపాడినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నట్టు సమాచారం.
అయితే.. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వైరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలో శునకం హల్చల్