హరియాణా ఫరీదాబాద్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. పాఠశాలతో పాటు సమీపంలోని వస్త్ర గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు.
భవనంలో చిక్కుకున్న కొంతమందిని కిటకీ ద్వారా కిందకు దించారు సహాయక సిబ్బంది.
ఇటీవలే గుజరాత్ సూరత్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ విషాద ఘటనలో 20 మంది విద్యార్థులు మరణించారు. భవన నిర్మాణ లోపాలు, సరైన అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమని విచారణలో తేలింది.
ఇదీ చూడండి: కోల్‌కతాలోని రసాయన గోదాంలో అగ్ని ప్రమాదం