ETV Bharat / bharat

అయోధ్యవాసుల్లో 'కొంచెం ఆందోళన- కొంచెం ఉత్కంఠ' - అయోధ్య తీర్పు

అయోధ్య తీర్పు వెలువడే అవకాశాలున్న తరుణంలో చారిత్రక నగరంవైపే అందరి దృష్టి నెలకొంది. తీర్పు ఎలా ఉన్నా.. నేతలు, మత పెద్దలందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. అయితే అయోధ్యవాసుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

అయోధ్యవాసుల్లో 'కొంచెం ఆందోళన- కొంచెం ఉత్కంఠ'
author img

By

Published : Nov 8, 2019, 5:07 AM IST

డ్రోన్​ సహాయంతో తీసిన దృశ్యాలు

ఇప్పుడు దేశ ప్రజల దృష్టి అంతా ఉత్తరప్రదేశ్​లోని అయోధ్య వైపే. వివాదాస్పద అయోధ్య భూ వివాద కేసుపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 17లోపు తీర్పు వెలువరించే అవకాశమున్న తరుణంలో అయోధ్యవాసుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కొందరు స్థానికులు భయాందోళనకు గురవుతుంటే.. మరికొందరు తీర్పు కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ముందు జాగ్రత్తగా...

తీర్పు తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఆశిస్తున్నప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా నిత్యావసర వస్తువులు, ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు కొందరు అయోధ్యవాసులు.

డా. ఇంద్రోనీల్​ బెనర్జీకి.. అయోధ్యలో ఓ క్లీనిక్​ ఉంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో అయోధ్య, పరిసర ప్రాంతాల నుంచి తన క్లీనిక్​కు రోగుల రద్దీ పెరిగిందని తెలిపారు. తీర్పు వెలువడిన అనంతరం తనను కలిసే అవకాశముంటుందో లేదోనని.. రోగులు ముందుగానే 15 రోజులకు సరిపడా మందులు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. తాను మాత్రం... అంతా మంచే జరుగుతుందని, భవిష్యత్తు అంతా బాగుంటుందని వారికి చెబుతున్నట్టు స్పష్టం చేశారు.

"అయోధ్యలోని ప్రజలందరూ(హిందువులు, ముస్లింలు) శాంతి కోరుకుంటున్నారు. అయోధ్య అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. తమ మధ్య ఘర్షణలు చెలరేగవని ధీమాగా ఉన్నారు. అతీత శక్తులు ఘర్షణకు కారణమైతే తప్పా.. ఈ నగరంలో హింస చెలరేగదని నాకు నమ్మకంగా ఉంది."
-- డా. ఇంద్రోనీల్​ బెనర్జీ, అయోధ్య వాసి.

ఒక వర్గానికి అనుకూలంగా తీర్పు వెలువడినా.. ఎలాంటి సమస్యలు తలెత్తవని మరో వైద్యుడు తెలిపారు. అయోధ్య ప్రజలు ఎంతో పరిణితి చెందారని.. రామమందిర నిర్మాణం చుట్టూ నెలకొన్న రాజకీయాలను పట్టించుకోవడం మానేశారని అభిప్రాయపడ్డారు.

వ్యాపారంపై ప్రభావం!

తీర్పు అనంతరం తమ వ్యాపారం దెబ్బ తినే అవకాశముందని అయోధ్యలోని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. నెల రోజుల నుంచి ఇతర ప్రాంతాల్లో తమ వ్యాపారాలు కుదేలయ్యాయని తెలిపారు.

భారీ బందోబస్తుతో భయం!

తీర్పు నేపథ్యంలో స్థానిక యంత్రాంగం ముందు జాగ్రత ఏర్పాట్లు చేసిందని కొందరు ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. అయితే ఇంత భారీ స్థాయిలో పోలీసుల మోహరింపును చూస్తుంటే.. ఎంతో భయంగా ఉందని మరికొందరు వెల్లడించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ ఈ నెల 17న పదవీవిరమణ చేయనున్నారు. ఈ లోపే సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్య కేసు తీర్పునిచ్చే అవకాశముంది.

AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 6 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2054: Bolivia Protests AP Clients Only 4238540
Clashes erupt across Bolivia as unrest continues
AP-APTN-2046: UK Corbyn No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4238538
Corbyn comments on Johnson article, age and Brexit
AP-APTN-2040: Lebanon Protest Vigil AP Clients Only 4238537
Women hold vigil in Beirut in support of protests
AP-APTN-2010: US House Taylor Transcript AP Clients Only 4238536
Democrats release transcript of key State witness
AP-APTN-2010: US Pentagon Qatar AP Clients Only 4238535
Esper welcomes Qatar counterpart to Pentagon
AP-APTN-1947: Mexico Americans Killed AP Clients Only 4238532
Mexico community shaken after violent killings
AP-APTN-1937: US MO King Boulevard Part must credit KCTV; No access Kansas City market; No use US broadcast networks; No re-use, re-sale or archive 4238531
Kansas City votes to remove MLK's name from street
AP-APTN-1904: US CA Dumpster Bear Must credit Placer County Sheriff's Office 4238530
California deputies rescue dumpster-diving bear
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.