ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తున్న పాకిస్థాన్‌పై ఆంక్షల కత్తి వేలాడుతోందన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్ఏటీఎఫ్) ఏ సమయంలోనైనా పాక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించవచ్చని వ్యాఖ్యానించారు.
ఆగస్టులో ఎఫ్ఏటీఎఫ్ ఆసియా పసిఫిక్ విభాగం పాక్‌పై ఆంక్షలు విధించింది. భారత్‌పై దాడుల అంశమై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉగ్రసంస్థలకు నిధుల రాకను అడ్డుకోలేక పోయిందన్న కారణంతో దాయాదిపై నిర్ణయం తీసుకుందీ సంస్థ. అంతర్జాతీయ సంస్థ అయిన ఎఫ్ఏటీఎఫ్ హవాలా, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక చేయూత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రిస్తుంది.
తప్పుడు విధాన నిర్ణయాలు, హద్దు మీరిన సైనిక వ్యవస్థతో సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా పాక్ ముందుకు నడుస్తోందని అభిప్రాయపడ్డారు రాజ్‌నాథ్.
పాక్ ప్రధాని సొంత విమానం సమకూర్చుకోలేరా?
ఓ అంతర్జాతీయ కార్యక్రమానికి పాక్ ప్రధాని సొంత విమానాన్ని సమకూర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు రాజ్‌నాథ్. సౌదీ అరేబియా ప్రభుత్వం అందించిన విమానంలో గతవారం న్యూయార్క్ నుంచి బయలుదేరిన అనంతరం సాంకేతిక సమస్య తలెత్తి ఇమ్రాన్‌ఖాన్ ఆగిపోయారని గుర్తు చేశారు. మరో వాణిజ్య విమానాన్ని చూసుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: భారత్ ఫస్ట్: ఎస్-400 కొనుగోలుపై జయ్శంకర్