ETV Bharat / bharat

రిలే నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు - రైతుల ఆందోళనలు

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఈనెల 23న 'కిసాన్​ దివస్'​ సందర్భంగా అన్నదాతలకు మద్దతుగా ప్రజలంతా ఒక్కపూట ఉపవాసం ఉండాలని కోరారు. రైతు సంఘాల నేతలతో ఒకట్రెండు రోజుల్లో వ్యవసాయ శాఖ మంత్రి చర్చలు జరపుతారని హోమంత్రి అమిత్ షా వెల్లడించారు.

Farmers to observe day-long relay hunger strike on Monday: Yogendra Yadav
రిలే నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు
author img

By

Published : Dec 20, 2020, 8:46 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలను మరింత ఉద్ధృతం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు స్వరాజ్​ ఇండియా సారథి యోగేంద్ర యాదవ్ ప్రకటించారు. 11మంది సభ్యుల బృందంలో సింఘు సిరిహద్దులో ఈ దీక్షను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈనెల 23న 'కిసాన్​ దివస్​' సందర్భంగా రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని మరో నేత రాకేశ్​ తైకైత్​ కోరారు.

ఈనెల 25 నుంచి 27 వరకు హరియాణాలో టోల్​గేట్ల వద్ద​ రుసుముల వసూలును అడ్డుకోనున్నట్లు రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాలా తెలిపారు. ఈనెల 27న ప్రధాని నరేంద్ర మోదీ మన్​ కీ బాత్​ కార్యక్రమంలో మాట్లాడినంత సేపు ప్రజలంతా పళ్లాలు మోగించి చప్పుళ్లు చేయాలని అభ్యర్థించారు.

త్వరలోనే చర్చలు..

రైతు సంఘాల ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ సోమవారం లేదా మంగళవారం సమావేశం అవుతారని హోమంత్రి అమిత్​ షా తెలిపారు. బంగాల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చూడండి: 'దాడులకు భయపడం- మా గెలుపు తథ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.