పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ రైతు ఉద్యమానికి సంబంధించి.. ట్విట్టర్‌లో షేర్ చేసిన టూల్ కిట్‌పై కూపీ లాగుతున్నారు పోలీసులు. దాన్ని ఎవరు రూపొందించారన్న విషయమై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఆ డాక్యుమెంట్ ఎక్కడ తయారు చేసి అప్‌లోడ్ చేశారన్న విషయాలు తెలుసుకునేందుకు.. ఐపీ చిరునామా లేదా ప్రాంతం వివరాలు తెలపాలంటూ గూగుల్‌ను సంప్రదించనున్నారు. ఈ టూల్ కిట్‌కు సంబంధించి కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. అయితే.. అందులో ఎవరినీ నిందితులుగా చేర్చలేదని వెల్లడించారు. కేవలం రూపొందించిన వారిపైనే విచారణ సాగుతుందన్నారు.
ఇదీ చదవండి: రైతుల ఆందోళనలకు గ్రెటా, రిహానా మద్దతు
కొద్ది రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న ఆందోళనల నేపథ్యంలో దాదాపు 300 వరకు సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా.. భారత ప్రభుత్వంపై బురద జల్లుతున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. టూల్ కిట్ ఖాతాను ఖలిస్థానీలు నడుపుతున్నట్టు వెల్లడించిన అధికారులు.. గణతంత్ర వేడుకలకు ముందు డిజిటల్ ఆందోళన నిర్వహించేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఆ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన దస్త్రాలను కూడా సేకరించామన్నారు.
ఇదీ చదవండి: గ్రెటా 'నిరసనల కుట్ర'పై దిల్లీ పోలీసుల కేసు
దిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమంపై బుధవారం రోజు.. స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్ ఓ టూల్ కిట్‌ను ట్వీట్ చేశారు. పోలీసులు ఆ టూల్‌కిట్‌ను రూపొందించిన వారిపై కేసుపెట్టి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: 'గ్రెటా, రిహానా మద్దతిస్తే తప్పేంటి?'