సీఏఏపై మీ అభిప్రాయం..
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. సీఏఏతోపాటు ఎన్ఆర్సీని కేంద్రం తీసుకురావలనుకోవడం నా మనస్సును బాధించింది. ప్రజలను నాయకులు విద్వేషం వైపు ప్రోత్సహిస్తున్నారు. సీఏఏతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు.
యూపీలో పోలీసుల తీరుపై..
ఉత్తరప్రదేశ్లో పోలీసులు నిరసనకారలు పట్ల దారుణంగా వ్యవహరించారు. వారి చర్యలు సిగ్గు చేటు. వీడియోలు చూస్తే ఎవరు ఘర్షణకు దిగారో అర్థం అవుతుంది. యూపీ ప్రభుత్వమే ఆ దాడులకు బాధ్యత వహించాలి.
షహీన్ బాగ్లో జరిగేది నిజమైన ఆందోళనేనా?
షహీన్ బాగ్లో మహిళలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఒక్క ముస్లింలు మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారు వచ్చి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
సీఏఏపై అంతర్జాతీయ ఒత్తిడి..
సీఏఏకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంది. ఈయూలో సీఏఏపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నా. దేశంలో ఇంత ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గడం లేదో అర్థం కావడం లేదు.
షార్జీల్ ఇమామ్ ప్రకటనపై..
జేఎన్‌యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్ చేసిన ప్రకటన సరికాదు. భారత్ ఐక్యతపై ఎలాంటి సందేహం లేదు. భారతీయులందరం కలిసుండాలి.