కేంద్ర ప్రభుత్వంపై మారోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది సుమారు 10.3 శాతం మేర క్షీణిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) అంచనాలను పేర్కొంటూ.. ఇది ప్రభుత్వ అతిపెద్ద ఘనత అంటూ ఎద్దేవా చేశారు. కరోనా కట్టడిలో భారత్ కన్నా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ముందున్నాయని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
2020-21 ఏడాదిలో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, చైనా, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, భారత్‌ల వృద్ధి అంచనాల ఛార్ట్‌ను తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు రాహుల్.
-
Another solid achievement by the BJP government.
— Rahul Gandhi (@RahulGandhi) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Even Pakistan and Afghanistan handled Covid better than India. pic.twitter.com/C2kILrvWUG
">Another solid achievement by the BJP government.
— Rahul Gandhi (@RahulGandhi) October 16, 2020
Even Pakistan and Afghanistan handled Covid better than India. pic.twitter.com/C2kILrvWUGAnother solid achievement by the BJP government.
— Rahul Gandhi (@RahulGandhi) October 16, 2020
Even Pakistan and Afghanistan handled Covid better than India. pic.twitter.com/C2kILrvWUG
" భాజపా ప్రభుత్వం సాధించిన మరో అతిపెద్ద ఘనత ఇది. కరోనా మహమ్మారిని భారత్ కన్నా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్లే బాగా కట్టడి చేయగలిగాయి. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత
భారత వృద్ధిపై ఐఎంఎఫ్ విడుదల చేసిన అంచనాలను సూచిస్తూ.. గత బుధవారం కూడా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. జీడీపీ తలసరి ఆదాయంలో భారత్‌కు పొరుగుదేశం బంగ్లాదేశ్ చేరువైందని ఎద్దేవా చేశారు. ఇది 6 సంవత్సరాల భాజపా విద్వేషపూరిత జాతీయవాద రాజకీయాల ఫలితమే అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఆ ఘనత భాజపా విద్వేష రాజకీయాలకు నిదర్శనం'